Viral Video: ఆకాశం నుంచి ఆ గ్రామంలో పడిపోయిన 500 కిలోల వస్తువు

ఈ లోహపు శకలాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

దక్షిణ కెన్యాలో ఆకాశం నుంచి ఓ భారీ వస్తువు వచ్చి పడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అది భూమిపై పడే సమయంలో మండుతూ ఎర్రగా కనపడింది. ముకుకు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ వస్తువు అంతరిక్షం నుంచి వచ్చిన శిధిలంగా కొందరు భావిస్తున్నారు. ఈ భారీ లోహపు రింగ్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ లోహపు రింగ్‌ కెన్యా ఉత్తర భాగంలో కూలిపోయిన రాకెట్ నుంచి పడి ఉండొచ్చని మరికొందరు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ లోహపు శకలాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ వస్తువు 2.5 మీటర్లు (సుమారు 8 అడుగులు) వెడల్పు, 500 కిలోల (సుమారు 1,100 పౌండ్లు) బరువు ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు అది ఏంటన్న విషయాన్ని కనుగొనే పనిలో ఉన్నారు. అంతరిక్షంలో అనేక శిధిలాలు ఉంటాయని, అవి ఎక్కడ పడతాయో కచ్చితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు.

చాలా శిథిలాలు గాల్లోనే మండిపోతాయని, ఇలా భూమిపై పడడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. ఈ వస్తువు వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపారు. ఈ వస్తువు భూమిపై పడగానే స్థానికులు తమకు సమాచారం అందించారని అధికారులు అన్నారు. అంతరిక్ష శిథిలాల సమస్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. కొన్ని స్పేస్ జంక్ ముక్కలు కార్లు, బస్సులంత పెద్దవిగా ఉంటాయి. అవి భూమిపై పడిపోతే ఆస్తి, ప్రాణ నష్టం కలగవచ్చు.

Nara Lokesh : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు