Nara Lokesh : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఒక ఫేక్ పార్టీ. అది దుష్ప్రచారం చేస్తోంది. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేసింది?

Nara Lokesh : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేశ్. ఉత్తరాంధ్రకు వైసీపీ చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా వైసీపీ తీసుకురాలేదన్నారు. వైసీపీ పాలనలో.. ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయాయని మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రుషికొండ భవనాలు తప్ప ఏం కట్టారని వైసీపీని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ దుష్ప్రచారం..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : బీజేపీ మహిళా నేత మాధవీ లతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
జిల్లాల వారీగా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేశ్. సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

Vizag Steel Plant
‘స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. రెగులరైజ్ చేయాలని పని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని మినహాయింపులు కూడా చేశాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని వందసార్లు చెప్పా. అయినా డౌట్ ఎందుకు? ఎందుకు తప్పుడు ప్రచారాన్ని నమ్ముతున్నారు?
వైసీపీ ఒక ఫేక్ పార్టీ, దుష్ప్రచారం చేస్తోంది…
మంత్రి వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి వచ్చి చెప్పారు, ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్పారు. మంత్రులం మేమంతా చెప్పాం. విశాఖకు అనేకసార్లు వచ్చాం. మంత్రులం మేమంతా చెప్పాం. విశాఖకు అనేకసార్లు వచ్చాం. గత 6 నెలల్లో నాలుగైదు సార్లు విశాఖకు వచ్చా. నేనే చాలా క్లారిటీగా చెప్పా. అయినా డౌట్ ఎందుకు? వైసీపీ ఒక ఫేక్ పార్టీ. అది దుష్ప్రచారం చేస్తోంది. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారు? కనీసం రైల్వే జోన్ కు భూమి ఇవ్వలేదు. ఏం చేశారు? ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. నేను తీసుకొచ్చాను టీసీఎస్.

Nara Lokesh
వైసీపీ పాలనలో ఉన్న కంపెనీలు కూడా పోయాయి. ఏం తీసుకొచ్చారు? మెడ్ టెక్ జోన్ లో కంపెనీలను ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్లు. మెడ్ టెక్ జోన్ సీఈవోను ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. పొరపాటున వార్తలు రాస్తే మీడియా ప్రతినిధులపైనా కేసులు పెట్టారు” అని వైసీపీపై విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేశ్.
Also Read : జగన్ విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి నిమ్మల