Love Proposal Goes Wrong : ఈ రోజుల్లో సినిమాల ప్రభావం జనాలపై మామూలుగా లేదు. సినిమాల్లో కనిపించే హీరోల్లా అంతా ఫీలైపోతుంటారు. అచ్చం హీరో చేసినట్లే తామూ చేయాలని, పాపులర్ అవ్వాలని చూస్తుంటారు.
ఇక లవర్స్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది ఎవరిపై అంటే.. ప్రేమికుల పైనే అని చెప్పాలి. సినిమాలో చూపించినట్లుగా.. తన లవర్ కి ప్రపోజ్ చేయాలని చాలామంది చూస్తారు. ఆ విధంగా ప్రపోజ్ చేసి లవర్ ను సర్ ప్రైజ్ చేయాలనుకుంటారు. అయితే, సర్ ప్రైజ్ సంగతి ఏమో కానీ, ఒక్కోసారి అలాంటి ప్రయత్నం బెడిసికొట్టి ఇబ్బందుల్లో పడటం మాత్రం అనేక సందర్భాల్లో జరిగింది. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
Also Read : Man Slips Into Coma: దోమ కుట్టడంతో 4 వారాలు కోమాలో యువకుడు.. 30 ఆపరేషన్లు
సినిమా స్టైల్ లో లవర్ ను సర్ ప్రైజ్ చేసేందుకు ప్రయత్నించిన ప్రియుడు.. బొక్కబోర్లా పడ్డాడు. లవర్ ను సర్ ప్రైజ్ చేయబోయి సముద్రంలో పడిపోయాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కడుపుబ్బా నవ్వులు పూయిస్తోంది.
అమెరికాకు చెందిన స్కాట్ క్లైన్.. తన ప్రియురాలికి ఎంతో రొమాంటిక్ గా ప్రపోజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం సముద్రంలో స్పెషల్ బోట్ లో ప్రయాణిస్తూ.. టైటానిక్ ఫోజ్ లో నిల్చొని రింగ్ తో ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. అయితే స్కాట్ ఒకటనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. అతడి ప్లాన్ రాంగ్ అయ్యింది.
జేబులో నుంచి రింగ్ బయటకు తీస్తుండగా.. అలల తాకిడికి బోటు కాస్త కదిలింది. దీంతో అతడి చేతిలోంచి రింగ్ జారి సముద్రంలో పడిపోయింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో స్కాట్ కూడా సముద్రంలో పడిపోయాడు. దీంతో అతడి లవర్ బిత్తరపోయింది. ఇదేంటి ఇలా జరిగిందని షాక్ అయ్యింది. కాసేపు నీళ్లలోనే ఉండిపోయిన స్కాట్.. ఆ తర్వాత ఎలాగోలా బోటు ఎక్కాడు. మొదటి ప్రయత్నం బెడిసి కొట్టినా అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. తగ్గేదేలే అంటూ.. మరో స్టైల్ లో తన లవర్ కి ప్రపోజ్ చేసి తాను అనుకున్నది సాధించాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
లవర్ కు ప్రపోజ్ చేసే ప్రయత్నంలో స్కాట్ సముద్రంలో పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.