Russia-Ukraine War: స్టార్ డ్యాన్సర్లతో యుక్రెయిన్ ప్రెసిడెంట్ డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో

యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పాత వీడియో వైరల్ అయింది. రష్యా దాడి చేస్తున్న సమయంలో జెలెన్ చూపిస్తున్న తెగువకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. సోషల్ మీడియాలో..

Zelen Sky

Russia-Ukraine War: యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పాత వీడియో వైరల్ అయింది. రష్యా దాడి చేస్తున్న సమయంలో జెలెన్ చూపిస్తున్న తెగువకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న ప్రెసిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.

2006లో ఓ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి డ్యాన్సింగ్ స్టార్లందరితో స్టేజ్ ను పంచుకున్నారు. ప్రొఫెషనల్ మాదిరిగా డ్యాన్స్ వేసి ఆకట్టుకున్న ఆయన ప్రదర్శనకు ఇంటర్నెట్ ప్రశంసలు కురిపిస్తుంది. నిజానికి అతను పార్టిసిపేట్ చేసిన అరంగ్రేట్ సీజన్ లోనే విన్నర్ ఆఫ్ ద షోను కొట్టేశారు.

‘జెలెన్ స్కీ 2006లో యుక్రెయిన్ వెర్షన్ డ్యాన్సింగ్ విత్ ద స్టార్స్ గెలుచుకున్నారు. మీరు ఊహించిన దాని కంటే ఇంకా బెటర్ గా ఉంటుంది ఈ షో’ అంటూ ఓ నెటిజన్ వీడియోను పోస్టు చేశారు.

Read Also: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు

దీనిని మిలియన్ మంది కంటే ఎక్కువ మంది వీక్షించారంటే చెప్పుకోవచ్చు. జెలెన్ స్కీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘ఎంత మంది అమ్మాయిలు అతనంటే మనసు పారేసుకున్నారో’ అని పోస్టు పెట్టాడు.

మరొకరేమో.. అసలు ఈ వ్యక్తి చేయకుండా ఉందేమైనా ఉందా.. అని కామెంట్ చేశారు.