Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు

సోవియట్ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యుద్ధంలో రష్యా సైనికుల ప్రాణాలను పుతిన్ గాల్లో వదిలేసాడంటూ అంతర్జాతీయంగా కధనాలు వెలువడ్డాయి.

Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు

War

Russia Ukraine war: యుక్రెయిన్ ను వశపరుచుకోవడమే లక్ష్యంగా పుతిన్ తలపెట్టిన యుద్ధం మరింత ఉగ్ర రూపం దాల్చుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన రహస్య ఎజెండాతో.. కావాలనే యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించాడని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యుద్ధంలో రష్యా సైనికుల ప్రాణాలను పుతిన్ గాల్లో వదిలేసాడంటూ అంతర్జాతీయంగా కధనాలు వెలువడ్డాయి. సుమారు 50,000 మంది రష్యా సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పుతిన్.. వారిని యుద్ధ రంగానికి తోలాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లిన రష్యా సైనికుల్లో వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు.

Also read: Russia-Ukraine War: యుక్రెయిన్ టూ తిరుపతి ఎయిర్‌పోర్ట్

అదే సమయంలో రష్యాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి రష్యా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని పత్రాలు అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స నిమిత్తం రష్యాలోని వైద్యులను, వైద్య సిబ్బందిని తరలించాలని ఆ పాత్రల్లోని ఆదేశాలు స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ ఎమ్మా బరోస్ పేర్కొన్నారు. ఆ పత్రాల ప్రకారం.. “రష్యా ప్రజల ప్రాణాలను కాపాడటం మరియు వారి ఆరోగ్యాన్ని కాపాడటం లక్ష్యంగా తక్షణ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని దేశంలోని వైద్య సంస్థలను కోరింది”. ముఖ్యంగా గాయాల నిపుణులు, గుండె సంబంధిత నిపుణులు, మాక్సిల్లోఫేషియల్ మరియు పీడియాట్రిక్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, రేడియాలజిస్ట్‌లు, నర్సులు మరియు అంటు వ్యాధి నిపుణులు సైతం అందుబాటులో ఉండాలని రష్యా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఆదేశించారు.

Also read: Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు

మిర్రర్ పత్రిక కధనం ప్రకారం..యుద్ధం ముగిసే నాటికి 50,000 మంది రష్యన్ సైనికులు మృతి చెందినా పుతిన్ లెక్క చేసేట్లుగా లేడని.. అంతకన్నా ఎక్కువ మరణాలు సంభవించినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. ఏది ఏమైనా ఈ యుద్ధం గెలవడం పుతిన్ కు ఎంతో ముఖ్యమని రష్యా నిఘావర్గాలు చెప్పినట్లు మిర్రర్ కధనం పేర్కొంది. ఒక వేళ యుద్ధంలో పట్టుకోల్పోయే పరిస్థితే తలెత్తితే.. రష్యా తన వద్దనున్న రసాయన బాంబులను కూడా ఉపయోగించేందుకు వెనుకాడబోదని విశ్లేషకులు అంటున్నారు.

Also read: Ukraine Crisis : ఉక్రెయిన్ టు హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు