Ukraine Crisis : ఉక్రెయిన్ టు హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

తమతో పాటు చాలామంది తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ ఉన్నాట్లు, సేఫ్ గా తిరిగి వస్తామని అనుకోలేదన్నారు. ఇంత త్వరగా స్పందించి తమను సేఫ్ గా ఇంటికి చేర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...

Ukraine Crisis : ఉక్రెయిన్ టు హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Shamshabad

Telugu Student Returned From Ukraine : ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకొస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో దిగిన అనంతరం వారి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులను మీడియాకు వివరిస్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల్లో ప్రియాంక ఒకరు. ఈమె హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, తాముంటున్న హాస్టల్ వెనుక ప్రాంతాల్లో మిలటరీ బలగాలు మోహరించాయన్నారు. యుద్ధం జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పేరెంట్స్ తో పాటు అక్కడ ఎంబసీకి సమాచారం అందించినట్లు తెలిపారు.

Read More : India : 240మంది భారతీయులతో బుడాపెస్ట్‌ నుంచి ఇండియా చేరుకున్న మూడో విమానం

తమతో పాటు చాలామంది తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ ఉన్నాట్లు, సేఫ్ గా తిరిగి వస్తామని అనుకోలేదన్నారు. ఇంత త్వరగా స్పందించి తమను సేఫ్ గా ఇంటికి చేర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ప్రతేక విమానంలో తమ కూతురు ప్రియాంక ఇంటికి చేరుకుందని తండ్రి సదర్ లాలా తెలిపారు. 2016లో ఉక్రెయిన్ వెళ్ళిందని, మెడిసిన్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోందన్నారు. ఇంటికి సేఫ్ గా రీచ్ అవడానికి కారకులైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు తమ కుటుంబం తరపున ప్రతేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు.

Read More : Shamshabad : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న 20 మంది తెలుగు విద్యార్థులు

తమ కూతురు ఇంటికి రావడం పట్టలేనంత సంతోషంగా ఉందన్నారు ప్రియాంక తల్లి. నిజమా కలనా అన్నట్లు ఉందని, ఉక్రెయిన్ లో జరుగుతున్న దాడులతో తమ కూతురికి ఏం అవుతుందోనని ఆందోళన పడ్డామన్నారు. ఉక్రెయిన్ లోని వెస్టర్న్ ప్రాంతంలో చాలా మంది ఉన్నట్లు, ప్రియాంకను రొమేనియా ఏరియా నుండి బస్సు మార్గంలో ఎంబసీ అధికారులు తీసుకువచ్చి ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారన్నారు. మరో మూడు నెలల్లో ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి అవుతుందనగా ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయినా.. పాప ప్రాణాలతో సేఫ్ గా తిరిగి రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు.