India : 240మంది భారతీయులతో బుడాపెస్ట్‌ నుంచి ఇండియా చేరుకున్న మూడో విమానం

భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని విమానాలు సిద్ధంగా ఉంచింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు.

India : 240మంది భారతీయులతో బుడాపెస్ట్‌ నుంచి ఇండియా చేరుకున్న మూడో విమానం

Indian Students

air india third flight : భారత్ ఆపరేషన్‌ గంగ కొనసాగుతోంది.యుక్రెయిన్‌ నుంచి బయటపడి భారతీయులు స్వదేశానికి చేరుతున్నారు. బుడాపెస్ట్‌ నుంచి మూడో విమానం ఇండియా చేరుకుంది. ఈ విమానంలో 240మంది భారతీయులు ఢిల్లీ వచ్చారు. మూడో విమానంలో 11మంది తెలుగు విద్యార్థులుండగా.. ఇప్పటిదాకా 59 మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా తిరిగొచ్చారు. మరోవైపు భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని విమానాలు సిద్ధంగా ఉంచింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు, పౌరులను ఎయిర్ ఇండియా విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు.

అంతకముందు భారత్ 469 మంది భారతీయులు చేరుకున్నారు. నిన్న రాత్రి 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ ఇండియా విమానం ముంబై చేరుకుంది. తెల్లవారు జామున 250 మందితో రెండో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంది. తెలుగువారిలో 11 ఏపీ, 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Russian Airstrikes : యుక్రెయిన్‌పై రష్యా ఎయిర్‌స్ట్రైక్స్‌.. కీవ్‌ సమీపంలోని పెట్రోలియం నిల్వ కేంద్రాలపై దాడులు

మరోవైపు యుక్రెయిన్‌లో చిక్కుకున్న 20మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డితో పాటు డీసీపీ స్వాగతం పలికారు. వీరంతా నిన్న రాత్రి యుక్రెయిన్‌ నుంచి ముంబై చేరుకోగా.. కొద్దిసేపటి క్రితం శంషాబాద్‌కు వచ్చారు. 20మంది విద్యార్థుల్ని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

యుక్రెయిన్‌ నుంచి రెండు విమానాల్లో పలువురు విద్యార్థులు ముంబయి, ఢిల్లీ చేరుకున్నారు. యుక్రెయిన్ నుంచి బయల్దేరిన మరో విమానం కూడా కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకుంది. అందులో కూడా కొందరు తెలుగు విద్యార్థులున్నారు. వీరు కూడా సాయంత్రానికి హైదరాబాద్‌, విజయవాడ చేరుకుంటారు. మరికొందరు బెంగళూరు మీదుగా వస్తున్నారు.