Russian Airstrikes : యుక్రెయిన్‌పై రష్యా ఎయిర్‌స్ట్రైక్స్‌.. కీవ్‌ సమీపంలోని పెట్రోలియం నిల్వ కేంద్రాలపై దాడులు

యుక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లోని గ్యాస్‌ పైప్‌లైన్‌ను రష్యన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో కీవ్‌పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ దూకుడుగా ముందుకు చొచ్చుకొస్తోంది.

Russian Airstrikes : యుక్రెయిన్‌పై రష్యా ఎయిర్‌స్ట్రైక్స్‌.. కీవ్‌ సమీపంలోని పెట్రోలియం నిల్వ కేంద్రాలపై దాడులు

Russia Army

Russian airstrikes on Ukraine : యుక్రెయిన్‌పై పట్టు కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పట్టు బిగించారు. కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యన్‌ ఆర్మీ దాడులను మరింత ముమ్మరం చేసింది. నిన్న రాత్రి కీవ్‌కు సమీపంలోని పెట్రోలియం నిల్ కేంద్రాలపై మిసైళ్ల వర్షం కురిపించింది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాలపై దాడులు జరిపింది రష్యన్‌ ఆర్మీ. రష్యా ఎయిర్‌స్ట్రైక్స్‌తో ఆ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లింది. అదే ప్రాంతంలో ఉన్న ఉన్న రెడియోధార్మిక వ్యర్థాలు నిల్వచేసే ప్రాంతాలపై కూడా ఎయిర్‌స్ట్రైక్స్‌ జరిగాయి.

మరోవైపు యుక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లోని గ్యాస్‌ పైప్‌లైన్‌ను రష్యన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో కీవ్‌పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ మరింత దూకుడుగా ముందుకు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు క్లియర్‌కట్‌గా అర్ధమవుతోంది. చర్చలకు యుక్రెయిన్ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో.. కీవ్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని రష్యన్ ఆర్మీకి మాస్కో నుంచి ఆదేశాలు అందాయి. అయితే రష్యన్‌ ఆర్మీకి యుక్రెయిన్‌ ప్రజలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.

NATO : యుక్రెయిన్‌కు నాటో దేశాలు ఆయుధ సాయం

ఇప్పటికే ఆయుధాలను, మాక్‌టెయిల్‌ బాటిళ్లను చేతపట్టిన యుక్రెయిన ప్రజలు.. రష్యన్‌ సైనికులు, రష్యన్ ఆర్మీ వాహనాలు కనిపిస్తే చాలు దాడులు చేస్తున్నారు. దీంతో కీవ్‌లో రష్యన్ ఆర్మీ ఆటలు అంత ఈజీగా సాగడం లేదు. మరోవైపు రష్యన్ ఆర్మీ దాడులో రెండు రోజుల్లో 198 మంది మృతి చెందినట్టు యుక్రెయిన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వేలాది మందిని హతమర్చామని ప్రకటించిన ప్రభుత్వం.. తమ పోరు కొనసాగుతోందని.. తమపై దండెత్తి వచ్చిన రష్యాకు తగిన గుణపాఠం చెబుతామంటోంది.