NATO : యుక్రెయిన్‌కు నాటో దేశాలు ఆయుధ సాయం

చెక్‌ రిపబ్లిక్‌ కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించేందుకు ముందుకొచ్చింది. తాము కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది.

NATO : యుక్రెయిన్‌కు నాటో దేశాలు ఆయుధ సాయం

Nato

Weapon assistance : యుక్రెయిన్‌ని ఒంటరి చేసి యుద్ధం మధ్యలో వదిలేసి నాటో దేశాలు వెళ్లిపోయయాయి. ఇప్పుడిప్పుడే యుక్రెయిన్‌కు పరోక్షసాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. 25 దేశాలు ఆయుధ సాయం చేసేందుకు అంగీకరించాయి. ఆయుధాలతో పాటు యుద్ధ సామాగ్రిని పంపిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ హామీ ఇచ్చారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు యుక్రెయిన్‌కు నిధులు విడుదల చేసిన అమెరికా.. ఈ సారి 4 వేల కోట్ల రూపాయల విలువైన ఆయుధ, ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అటు అమెరికా, ఇటు ఫ్రాన్స్‌ సాయంతో యుక్రెయిన్‌ సైన్యంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

అటు చెక్‌ రిపబ్లిక్‌ కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించేందుకు ముందుకొచ్చింది. తాము కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. జర్మనీ కూడా వెయ్యి యాంటీ ట్యాంక్ వెపన్స్‌తో పాటు 500 ఎయిర్ మిస్సైల్స్‌ను యుక్రెయిన్‌కు అందించనుంది. యుద్ధ వ్యతిరేక కూటమి పనిచేస్తుండటంపై జెలోన్‌స్కీ ఆనందం వ్యక్తం చేశారు. రష్యా దండయాత్ర మొదలుపెట్టాక.. యుక్రెయిన్‌కు ఏ దేశం నుంచి సైనికపరమైన సాయం అందలేదు. కానీ ఇప్పుడు యుక్రెనియన్ల పోరాట స్ఫూర్తి.. నాటో దేశాల్లో కదలిక తెచ్చింది. తమకు దేశాలు అండగ నిలబడడంతో రష్యాని ఎలాగైనా నిలువరించేందుకు చివరిదాకా పోరాడతామంటున్నారు.

Indians Ukraine : యుక్రెయిన్‌లో భారతీయులకు విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలు

దేశ ప్రజలకంటే తన ప్రాణాలు ముఖ్యం కాదని మరోసారి యుక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీ తేల్చిచెప్పారు. నిన్నటి నుంచి కీవ్‌లోనే ఉన్న రష్యాబలగాలు ఏ క్షణమైనా నగరాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో అమెరికా జెలన్‌స్కీకి ఆఫర్ ఇచ్చింది. జెలన్‌స్కీకి ప్రాణ హాని ఉందని అనుమానిస్తున్న అమెరికా ఆయన్ను దేశం దాటించేందకు…ప్రత్యేక బలగాలు పంపుతామని ప్రకటించింది. యూరప్‌లోని ఏదో ఓ ప్రాంతానికి ఆయన్ను సురక్షితంగా తరలిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌ తనకొద్దన్నారు జెలెన్‌స్కీ. కీవ్‌లో ఉంటానని తేల్చిచెప్పారు.

‘నన్ను తప్పించడం కాదు…చేతనైతే నా దేశాన్ని రక్షించండి’… అమెరికాకు యుక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇది. తనను దేశం నుంచి తప్పిస్తానన్న ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. యుద్ధానికి దారితీసే పరిస్థితులు సృష్టించి…తీరా యుద్ధం మొదలయ్యాక ఆయుధాలు, బలగాలు పంపకుండా రష్యాపై ఆంక్షలు, ఐక్యరాజ్యసమితిలో తీర్మానాలతో సరిపెట్టిన అమెరికాకు గట్టి ఝలక్ ఇచ్చారు. బైడన్‌కు జెలెన్ స్కీ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. తనను యుక్రెయిన్‌ నుంచి తప్పిస్తానన్న అమెరికాకు కౌంటర్‌ ఇచ్చారు. ఆఫర్లు కాదు ఆయుధాలు ఇవ్వండంటూ జెలెన్‌స్కీ అమెరికాకు సమాధానమిచ్చారు.

Biden: రష్యా రెండు ఆప్షన్లే ఇచ్చింది.. మూడవ ప్రపంచ యుద్ధం? ఆర్థిక నిషేధం? -అమెరికా

మరోవైపు యుక్రెయిన్‌కు మరో విడత యుద్ధసాయానికి సంబంధించిన మెమెరాండంపై బైడన్ సంతకం చేశారు. యుక్రెయిన్‌కు బలగాలు తరలించాలని, యుక్రెయిన్‌కు మద్దతుగా పోరాడాలని ఓ పక్క జెలెన్‌స్కీ వేడుకుంటోంటే..అదేమీ పట్టించకోకుండా గతంలోలా..యుద్ధసహాయంపై మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. రక్షణ ఆయుధాలు, సర్వీసులు, మిలటరీ ఎడ్యుకేషన్, శిక్షణ కోసం యుక్రెయిన్‌కు తక్షణ సాయం కింద భారీ మొత్తం ప్రటించింది. 550 మిలియన్ డాలర్ల సాయానికి సంబందించిన మెమరాండంపై బైడన్ సంతకం చేశారు.