Biden: రష్యా రెండు ఆప్షన్లే ఇచ్చింది.. మూడవ ప్రపంచ యుద్ధం? ఆర్థిక నిషేధం? -అమెరికా

రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా దాడిలో అనేక ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

Biden: రష్యా రెండు ఆప్షన్లే ఇచ్చింది.. మూడవ ప్రపంచ యుద్ధం? ఆర్థిక నిషేధం? -అమెరికా

Biden

Biden: రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే రష్యా దాడిలో అనేక ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా మనకు రెండు ఆప్షన్‌లను మాత్రమే ఇచ్చిందని బైడెన్ అభిప్రాయపడ్డారు. అందులో ఒకటి మూడవ ప్రపంచ యుద్ధం కాగా.. రెండవ ఆప్షన్ రష్యాపై ఆర్థిక ఆంక్షలు అని అన్నారు.

యుక్రెయిన్‌లో ఆకస్మిక దాడి తర్వాత అమెరికా రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. SWIFT నుండి రష్యన్ బ్యాంకులను బహిష్కరిస్తున్నట్లు వైట్ హౌస్, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రకటించాయి.

ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికే..
యుక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం దెబ్బకు వైట్ హౌస్, యూరోపియన్ కమిషన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా రష్యన్ బ్యాంకులను SWIFT నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది ఆర్థిక సంస్థలను లింక్ చేసే సెక్యురిటీ నెట్‌వర్క్. యుక్రెయిన్‌తో యుద్ధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యూహాత్మక వైఫల్యమని ఈ దేశాలు సమిష్టిగా సమర్థించాయి. వైట్ హౌస్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ బ్యాంకులు డిస్‌కనెక్ట్ అయ్యేలా ప్రతి ఒక్కరూ హామీ ఇస్తున్నట్లు అమెరికా చెబుతోంది.

యుక్రెయిన్‌పై దాడులు:
రష్యా సెంట్రల్ బ్యాంక్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించడంపై అమెరికా, యూరోపియన్ అధికారులు చర్చిస్తున్నారు. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరిని చేసి శిక్షించడానికి USతో సహా పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్య తీసుకున్నప్పటి నుంచి ఉక్రెయిన్‌పై నిరంతరం దాడి జరుగుతోంది.