Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్‌ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్‌!

Watch Epic Video : చిన్నప్పడు గాల్లో రాకెట్లను విసిరే ఉంటారు.. కాగితాలను రాకెట్ల మాదిరిగా చేసి పైకి ఎగరేసి ఆనందపడుతుంటారు.

Watch Epic Video : చిన్నప్పడు గాల్లో రాకెట్లను విసిరే ఉంటారు.. కాగితాలను రాకెట్ల మాదిరిగా చేసి పైకి ఎగరేసి ఆనందపడుతుంటారు. క్లాసు రూంల్లో తోటి విద్యార్థులపైకి కూడా రాకెట్లను విసురుతూ అల్లరి పనులు చేసే ఉంటారు. పేపర్ రాకెట్ అనగానే చాలామందికి తమ చిన్ననాటి చిలిపి చేష్టలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ పేపర్ రాకెట్లతోనే ఓ వ్యక్తి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేశాడు. అందరిలా అతడు పేపర్ రాకెట్ విసిరాడు. అయితే అతడి పేపర్ రాకెట్ అసలైన రాకెట్ లా గాల్లో దూసుకెళ్లింది. దాంతో అతడు గిన్నిస్ బుక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

దక్షిణ కొరియాకు చెందిన కిమ్ క్యు టే అనే వ్యక్తి తాను తయారుచేసిన పేపర్‌ రాకెట్ గాల్లోకి విసిరాడు. అది సుమారు 77.134 మీ (252 అడుగుల 7 అంగుళాలు) దూరం వేగంగా దూసుకెళ్లింది. 2012లో అమెరికన్ క్వార్టర్‌బ్యాక్ జో అయోబ్, ఎయిర్‌ప్లేన్ డిజైనర్ జాన్ ఎమ్. కాలిన్స్ ఆ రికార్డును నెలకొల్పగా.. ఇప్పుడా ఆ రికార్డును కిమ్‌ బ్రేక్ చేశాడు.

జో అయోబ్, కాలిన్స్‌ విసిరిన రాకెట్ సుమారు 69.14 మీటర్లు (226 అడుగుల 10 అంగుళాలు) దూరం ప్రయాణించింది. దాంతో అతడు గిన్నిస్ బుక్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా కిమ్‌ మాట్లాడుతూ.. తన స్నేహితుల సపోర్టుతోనే ఈ గిన్నిస్ రికార్డుని సాధించినట్టు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Read Also : Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!

ట్రెండింగ్ వార్తలు