Dubai Sheik Sing Sp Balasubrahmanyam’s Song On Tiktok
SP balu-Dubai Sheik : ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పాట అంటే ప్రాణంగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఎస్పీ బాలు పాట పాడుతుంటే మంత్రముగ్ధులై పోతారు. ఆయనకు ఒక్క తెలుగువారే కాదు.. ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఏ భాషలోనైనా పాటను అవలీలగా పాడేయగలరు ఎస్పీబాలు.. ఎన్నో వేల పాటలతో ఆయన తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించారు.
Wife Beaten Husband Head : కూర బాగోలేదన్నాడు….తల పగలగొట్టిన భార్య
బాలు భౌతికంగా లేకపోయినా ఆయన పాడిన పాటలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఏ సాంగ్ అయినా తన గాత్రంతో పాటకు ప్రాణం పోస్తారు. బాలు పాడిన పాటకు దుబాయ్ షేక్ కూడా ఫిదా అయిపోయారు. దుబాయ్ షేక్ బాలు పాడిన పాటను పాడుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు.
1986లో క్లాసికల్ సూపర్ హిట్ కొట్టిన సిరివెన్నెల మూవీలోని విధాత తలపున.. వికసించినది ఈ గీతం అంటూ సాగే పాటను పాడి దుబాయ్ షేక్ అందరిని అబ్బుర పరిచారు. తెలుగు భాష తెలియకున్నా.. ఎంతో కష్టపడి పాట పాడి అందరిని ఆశ్చర్యపరిచారు. దుబాయ్ షేక్ పాడిన పాట టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.