‘పాకిస్తాన్ ముస్లింల విషయంలో ద్వంద వైఖరి వహిస్తోంది’

కశ్మీర్‌లో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఐక్యరాజ్యసమితిలో స్ట్రాంగ్ కౌంటర్ ఎదురైంది. పాకిస్తాన్‌కు పశ్చిమంగా ఉన్న చైనాలోని వీగర్‌ ముస్లింల పరిస్థితి మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో ఉంటున్న దాదాపు 10 లక్షల మంది ముస్లింలు చైనా ప్రభుత్వం నిర్భందంలో ఉన్నారని గుర్తు చేసింది. దీనిపై పాకిస్తాన్ ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీసింది.

అమెరికాకు చెందిన దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్‌ సెక్రటరీ అలీస్‌ వెల్స్‌ ఈ ప్రశ్నల దాడి చేశారు. యూఎన్ఓలో సోమవారం ఇమ్రాన్‌ ఖాన్‌తో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చైనా ముస్లింల విషయంలో స్పందనపై ఇమ్రాన్ ఖాన్ ఇలా బదులిచ్చారు. ‘చైనాతో మాకు ఆర్థికపరమైన ప్రత్యేక లావాదేవీలు ఉన్నాయి. ఇలాంటి అంశాలు మేం వేరే రకంగా చర్చించుకుంటాం’అని ఇమ్రాన్‌ బదులిచ్చారు. 

దీనిపై అలీస్ వెల్స్ పాక్ ద్వంద వైఖరి వహిస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌లోని ముస్లింలను ఒకలా, చైనాలోని ముస్లింలను మరోలా భావిస్తుందని పాక్ వైఖరిని ఎండగట్టారు. ‘చైనాలో నిర్భందంలో ఉన్న ముస్లింలతో పోలిస్తే కశ్మీర్‌లో ఉన్న ముస్లింలు ఇంకా చాలా తక్కువ సంఖ్యలో నిర్భంధంలో ఉన్నారు. కశ్మీర్ కంటే ముందు చైనాలో ఉన్న వాళ్ల గురించి పాకిస్తాన్‌ ఎక్కువ కేర్‌ తీసుకోవాల’ని వెల్స్‌ సూచించారు.