Gunfire Near White House : వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం.. దుండగుడు దూసుకొచ్చి బ్యాగులో నుంచి తుపాకీ తీసి.. వైట్‌హౌస్‌లోనే ట్రంప్..
Gunfire Near White House : అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు అక్కడి భద్రతా బలగాలపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, కాల్పులు ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు.
- Harish Thanniru
- Published on- May 24, 2026 / 08:00 AM IST
Gunfire Near White House
- వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం
- ఎదురు కాల్పులు జరిపిన సీక్రెస్ సర్వీస్ అధికారులు
- నిందితుడు చికిత్స పొందుతూ మృతి
- కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లోనే ట్రంప్
Gunfire Near White House : అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు అక్కడి భద్రతా బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు దాదాపు 15 నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
Also Read : Ivanka Trump : ఇవాంకా ట్రంప్‌ని లేపేయడానికి ప్లాన్.. పట్టుబడిన ఇరాన్ టెర్రరిస్ట్? అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల నేపథ్యంలో శబ్దాలతో వైట్‌హౌస్ పరిసరాలు ఒక్కసారిగా రణరంగంగా మారాయి. యూఎస్ సీక్రెట్ సర్వీస్ వెల్లడించిన ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ ఎన్‌డబ్ల్యూ వద్ద ఉన్న వైట్‌హౌస్ సెక్యూరిటీ బూత్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారుల సమీపానికి రాగానే.. తన బ్యాగులో నుంచి తుపాకీని బయటకు తీసి ఒక్కసారిగా సెక్యూరిటీ బూత్‌పైకి వరుసగా కాల్పులు ప్రారంభించాడు. అయితే, స్థానికుల కథనం ప్రకారం.. దాదాపు 15 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించినట్లు తెలిపారు.
నిందితుడు కాల్పులకు తెగబడడంతో అప్రమత్తమైన అధికారులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని భద్రతా సంస్థ స్పష్టం చేసింది. ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ లోపలే ఉన్నారు. అయితే, ఈ దాడి వల్ల అధ్యక్షుడి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిళ్లలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ టెంట్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఒక్కసారిగా తూటాల శబ్దాలు వినబడటంతో భయాందోళనకు గురైనట్లు చెప్పారు.
