భర్తలను వీపుపై మోస్తూ భార్యలు పరుగు పందెం..!!

భర్తలను వీపులపై మోస్తూ పరుగు పందాల్లో’ పాల్గొన్నారు నేపాల్ మహిళలు. ఆడవారు మగవారికి ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తూ..మార్చి 8,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేపాల్ రాజధాని నగరం ఖాట్మండు నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్‌ఘాట్ విలేజ్ కౌన్సిల్‌లోని ఓ స్కూల్ గ్రౌండ్ లో మహిళలు తమ భర్తలకు వీపులపై ఎక్కించుకుని పరుగు పందాల్లో పాల్గొన్నారు.

Nepal Womens

wifes participated in running race lifting husbands : మగవారికి మేం ఎందులోను తీసిపోం అంటున్నారు మగువలు. ఉద్యోగాల్లోను..ప్రతిభాపాటవాలను ప్రదర్శింటంలోను పురుషులకు ఏమాత్రం తీసిపోమని ఇప్పటికే నిరూపించారు మహిళలు. కానీ శారీరకంగా మాత్రం మగవారి కంటే ఆడవారు బలహీనులనే భావన మాత్రం పోవటంలేదు. దీనికి కారణాలు ఏమైనాగానీ..ఈ విషయంలో కూడా మేం మగవారికి సరిసమానవేమనని ‘భర్తలను వీపులపై మోస్తూ పరుగు పందాల్లో’ పాల్గొన్నారు నేపాల్ మహిళలు.

ఆడ-మగ అనే మాట వస్తే చాలామంది లింగ సమానత్వం గురించే మాట్లాడతారు. ఆడవారు మగవారికి ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తూ..మార్చి 8,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేపాల్ రాజధాని నగరం ఖాట్మండు నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్‌ఘాట్ విలేజ్ కౌన్సిల్‌లోని ఓ స్కూల్ గ్రౌండ్ లో మహిళలు తమ భర్తలకు వీపులపై ఎక్కించుకుని పరుగు పందాల్లో పాల్గొన్నారు. నేపాల్ లోని ఓ స్కూల్లో నిర్వహించిన పోటీల్లో 16 జంటలు పాల్గొన్నాయి. వీరు తమ తమ భర్తలకు వీపులపై మోస్తూ 100 మీటర్లు పరుగు పందెంలో పాల్గొన్నారు. ఆడవారు దేంట్లోను తక్కువ కాదు అనే నినాదంతో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొని గెలిచిన జంటలతో పాటు అందరికి దృవపత్రాలు ఇచ్చి సత్కరించారు.

ఈ సందర్భంగా ఈ పరుగు పందెంలో పాల్గొన్న శ్రేష్ట అనే మహిళ మాట్లాడుతూ..”నేను నా భర్తను నావీపుమీద ఎక్కించుకుని మోసుకొని ఈ రేసులో పాల్గొన్నాననీ..మహిళలు దేంట్లోనూ ఎవ్వరికీ తీసిపోరని నిరూపించటానికి ఈ రేసులో పాల్గొన్నానని తెలిపారు.

భర్తలను మోస్తూ భార్యలు పరుగులు పెడుతుంటే చూడటానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంటలను ప్రశంసిస్తూ నిర్వాహకులు ప్రతి జంటకు సర్టిఫికెట్లు అందజేశారు.

“ఇది ఇది మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించటానికి చేపట్టిన స్నేహపూర్వకంగా జరిగిన ఓ ఆట మాత్రమేనని.. దీంట్లో గెలుపు ఓటములు ఉండవనీ..దీంట్లో పాల్గొన్న ప్రతీ మహిళకు సర్టిఫికేట్ ఇచ్చామని గ్రామ మండలి చీఫ్ దుర్గా బహదూర్ థాపా తెలిపారు.