Snake Catcher : పామును చూస్తే చాలామంది పరుగులు పెడతారు. పాము కనపడిన ప్రదేశం వైపు వెళ్లేందుకు కూడా దైర్యం చేయరు. కానీ ఓ మహిళకు మాత్రం పాములంటే అసలు భయం లేదు. ఒక్క కాటుతో ప్రాణాలను హరించే కింగ్ కోబ్రాలను కూడా ఆమె తన చేతులతో పట్టుకుంటుంది. కాటుతో ప్రాణాలు హరించే పాములను ఆ మహిళా ఆలా పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.. నెట్టింట్లో మహిళ పాములు పెట్టె వీడియోలు చూసి శబాష్ అంటున్నారు.
చదవండి : Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముడు బలి
తాజాగా ఈ మహిళ ఓ పాడుబడిన ఇంట్లోకి చేరిన పామును పట్టుకొని ఇంటికి కొద్దీ దూరంలో వదిలేసింది. అది మళ్ళీ అదే ఇంటివైపుకు వెళ్తుండటంతో దానిని పట్టుకొని ఓ గోనెసంచిలో బందించి దూరంగా వదిలి వచ్చింది. పామును పట్టుకునే సమయంలో సదరు మహిళ చూపిన దైర్యం వ్యవహరించిన తీరు అందరిని కట్టిపడేసింది. పాము బుసలు కొడుతూ మీదకు వస్తున్నా ఏ మాత్రం జంకకుండా దాని తలను పట్టుకుంది.
ఇది పాత వీడియో అయినప్పటికీ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ మహిళ పాము పట్టే నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇక వేలల్లో లైకులు, విభిన్న కామెంట్లతో తిరిగి వార్తల్లో నిలిచింది.