Handy Husband: మూడున్నర వేలకు భర్తను అద్దెకిస్తున్న భార్య

యూకేలోని లారా యంగ్ అనే మహిళ అదనపు సంపాదన కోసం ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎలాంటి హంగామా లేకుండా, తన భర్త నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అంతే, ఆమె 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

Handy Husband: యూకేలోని లారా యంగ్ అనే మహిళ అదనపు సంపాదన కోసం ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎలాంటి హంగామా లేకుండా, తన భర్త నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. అంతే, ఆమె ‘రెంట్ మై హ్యాండీ హస్బెండ్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇవ్వొచ్చన్న మాట.

లారా భర్త, జేమ్స్ ఉద్యోగాలలో స్పెషల్ టాలెంట్‌తో పనిచేస్తారు. వారి ఇంటిని నైపుణ్యాలతో ప్రత్యేకంగా మార్చారు. జేమ్స్ కస్టమ్ బెడ్‌లను నిర్మించడం వంటి పనులతో బకింగ్‌హామ్‌షైర్ ఇంటిని మార్చేశాడు. డైనింగ్ టేబుల్ తయారీ, పెయింటింగ్, డెకరేటింగ్, టైల్ వేయడం, కార్పెట్ వేయడంలో కూడా నేర్పును సాధించాడు.

“అతను ఇల్లు, తోట చుట్టూ ఉన్న ప్రతిదానిలో ప్రత్యేకత. కాబట్టి ఆ నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి అతనిని ఎవరినైనా అద్దెకు ఎందుకు తీసుకోకూడదని అనుకున్నానని? చెప్పింది” లారా.

Read Also : అద్దె ఇల్లు చూడటానికి వెళ్లి రాసలీలలు

“చాలా మంది ఆసక్తి చూపించారు. కొంతమందికి తప్పుడు ఆలోచన వచ్చింది. జేమ్స్‌ను పూర్తిగా వేరొకదాని కోసం నియమించుకుంటున్నానని భావించారు! అతని నుంచి డబ్బు సంపాదించడం కోసం మాత్రమే అలా చేయడం లేదు. నైపుణ్యాలను వినియోగించడానికి” అని ఆమె వివరించింది.

గతంలో ఒక షాపులో నైట్ షిఫ్ట్ వర్కర్‌గా పనిచేసే జేమ్స్ రెండేళ్ల క్రితం ముగ్గురు పిల్లలకు సాయం చేయడానికి లారా కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు. వీరిలో ఇద్దరు ఆటిస్టిక్‌ అనే సమస్యతో బాధపడుతున్నారు.

జేమ్స్ పని కోసం లారా దాదాపు £35 (రూ. 3365) వసూలు చేస్తోంది. డిస్కౌంట్లను కూడా అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు