Amou Haji: 50 ఏళ్లుగా స్నానం కూడా చేయని ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి

వాస్తవానికి హజి స్నానం చేయకపోవడానికి కారణం.. తాను అనారోగ్యానికి గురవుతాననే భయమట. నీళ్లంటే కూడా అతడికి చాలా భయమట. ఒక సందర్భంలో అతడిని ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెప్పినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఒకటి తాజాగా వెల్లడించింది. అయితే కొద్ది నెలల క్రితం అతడిని గ్రామస్తులు బలవంతంగా తీసుకెళ్లి స్నానం చేయించారట. అయితే ఆ ఫొటోలు మాత్రం బయటికి రాలేదు. హజిపై 2013లో ఒక డాక్యుమెంటరీ తీశారు.  దాని పేరు ‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హజి’.

Amou Haji: 50 ఏళ్లుగా స్నానం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇరాన్‭కు చెందిన అమౌ హజి (94) తాజాగా మృతి చెందారు. ఆదివారం అతడి మృతి చెందినట్లు ఇరాన్‭కు చెందిన జాతీయ మీడియా మంగళవారం స్పష్టం చేసింది. ఇరాన్‭లోని దక్షిణ ప్రావిన్స్‭కు చెందిన దేజ్‭గా అనే గ్రామానికి చెందిన వ్యక్తి అని ఓ మీడియా వెల్లడించింది. హజి గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా ఆయనకు ముద్ర పడిపోయింది.

వాస్తవానికి హజి స్నానం చేయకపోవడానికి కారణం.. తాను అనారోగ్యానికి గురవుతాననే భయమట. నీళ్లంటే కూడా అతడికి చాలా భయమట. ఒక సందర్భంలో అతడిని ప్రశ్నిస్తే ఇదే విషయాన్ని చెప్పినట్లు ఇరాన్ మీడియా సంస్థ ఒకటి తాజాగా వెల్లడించింది. అయితే కొద్ది నెలల క్రితం అతడిని గ్రామస్తులు బలవంతంగా తీసుకెళ్లి స్నానం చేయించారట. అయితే ఆ ఫొటోలు మాత్రం బయటికి రాలేదు. హజిపై 2013లో ఒక డాక్యుమెంటరీ తీశారు.  దాని పేరు ‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హజి’.

Apple Watch : బతికుండగానే భార్యను సమాధిలో పాతిపెట్టిన భర్త.. రక్షించిన ఆపిల్ వాచ్.. ఎలాగో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు