worlds Richest woman : ఏకైక మహిళా చక్రవర్తి .. అందంలోనే కాదు ప్రపంచలోనే అత్యంత ధనవంతురాలు

అందంలోను ఆస్థుల్లోను ఆమెకు అంబానీ,అదానీయే కాదు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా సాటిరారు. అంతులేని సంపదతో పాటు సౌందర్యం కూడా ఆమె సొంతం. అంతేకాదు ఆమె అందం వెనుక కిరాకత చరిత్ర వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఏకైనా మహిళా చక్రవర్తిగా పేరొందిన ఆమె చరిత్రలో ఎన్నో విశేషాలున్నాయి.

worlds Richest woman Empress Wu

worlds Richest woman Empress Wu : ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా అధినేత ఎలన్ మాస్క్ (Elon Musk) అని. అలాగే జెఫ్ బెజోస్(Jeff Bezos),ముఖేశ్ అంబానీ(Mukesh Ambani), అదానీ (Gautam Adani)ఇలా టకటకా చెప్పేస్తారు. కానీ వీరిని మించి అన్నట్లుగా తాజాగా ఒకరి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆమె ఓ మహిళ కావటం మరో విశేషం. అందంలోను..ఆర్థిక స్థాయిలోను కూడా ద గ్రేట్ అనిపించుకుంటోంది. జీవించివున్నవారిలో అత్యంత అందమైన మహిళ అనే ఘనతతో పాటు అంబానీ,అదానీలను మించి ధనవంతురాలిగా సోషల్ మీడియలో ఆమె పేరు మారుమోగిపోతోంది. ధనవంతురాలు అనే పేరుతో పాటు ఆమె గురించి తెలిస్తే వెన్నులో వణుకుపుట్టేంత చరిత్ర కలిగిన మహిళగా కూడా పేరొందారు.

అమే పేరు ‘ఎంప్రెస్ వు’(Empress Wu ). చైనాకు చెందిన ఎంప్రెస్ వు ఇప్పటివరకు జీవించిన అత్యంత అందమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు. చైనీస్ చరిత్రలో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి(She was the first and only female emperor in Chinese history)కావటం మరో విశేషం. భారతదేశంలో ధనవంతుడు ఎవరు అంటే ఠక్కుమని ముఖేష్ అంబానీ పేరు చెప్పేస్తాం. కానీ అతని ఆస్తులను మించే కాదు ప్రపంచ ధనవంతుడగా టాప్ లిస్టులో ఉన్న ఎలాన్ మస్క్ కంటే ధనవంతురాలు ‘ఎంప్రెస్ వు’..

ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఈ మహరాణి సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని నిపుణుల అంచనా.. చైనాకు చెందిన ఎంప్రెస్ వు భూమిపై నివసిస్తున్న అత్యంత సంపన్న మహిళగా పేరొందారు. ఆమె నికర విలువ USD 16 ట్రిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ తదితరుల నికర విలువ కంటే ఎక్కువే… వు ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందిన మహిళ. ఆమె చరిత్రలో అత్యంత ధనిక మహిళా రాణి. అంతేకాదు చైనీస్ చరిత్రలో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి.

అందం వెనుక కిరాతకం..
అందమైన రాణిగా పేరొందిన ఈమె చరిత్ర వింటే మాత్రం వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. అధికారం కోసం కన్నబిడ్డలనే కడతేర్చిన కిరాతకపు చరిత్ర ఈమెది. మహారాణి పదవి కోసం కన్నబిడ్డలను కూడా చంపింది అనే పేరొంది. కొన్ని నివేదికలు ఆమె గురించి అవే చెబుతున్నాయి. టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు చాలా క్రూరమైన మహిళగా కూడా పేరొందింది.

అధికారంలో ఉండేందుకు తన పిల్లలను కూడా చంపేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎంప్రెస్ వు ఉన్నత విద్యావంతురాలు కూడా. అంతేకాదు జీవితంపై టీవీ సీరియల్స్ కూడా ఉన్నాయి. ఫ్యాన్ బింగ్‌బింగ్ నటించిన ఎంప్రెస్ ఆఫ్ చైనా అటువంటి టీవీ సిరీస్.దాదాపు 15 ఏళ్లు పాలించింది..ఆమె హయాంలో, టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చైనా ప్రాజెక్ట్ నివేదించింది. అలా ఆమె ఆదాయం ఇప్పటికి తగ్గలేదు.

ఎలోన్ మస్క్ నికర విలువ దాదాపు 235 బిలియన్ డాలర్లు. జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ల డాలర్లు. భారతదేశపు అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు 91 బిలియన్ డాలర్లు. ఎంప్రెస్ వు సంపద మాత్రం ట్రిలియన్లలో ఉంది..దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

మధ్య ఆసియాలో చైనా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఈ అందాల సుందరాంగి కీలక పాత్ర పోషించారు. టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చైనా ప్రాజెక్ట్ నివేదించింది. మరణానంతరం..ఎంప్రెస్ వుకు వివిధ అధికారిక బిరుదులు లభించాయి.