ఈ విశ్వంలో చిత్ర విచిత్రాలు ఎన్నో..ఎన్నెన్నో..ప్రకృతిలో మొక్కలకు ప్రత్యేక స్థానముంది. లక్షల కోట్ల రకాల మొక్కల్లో ఎన్నో వింతలు దాగున్నాయి. వందల సంవత్సరాల పాటు బతికే చెట్లు గురించి విన్నాం. ఈ క్రమంలో ఓ మొక్క వేల సంవత్సరాలు బ్రతుకే ఉంది. దాని పేరు ‘యరేటా’
ఎన్నో మొక్కలు చూసుంటాం..ఇంకెన్నో మొక్కల గురించి తెలుసుకుని ఉంటాం. కానీ సంవత్సరానికి ఒకటిన్నర సెం.మీ మాత్రమే పెరిగే ‘యరేటా’ మొక్క మూడు వేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉంది. ఒక మొక్క అంత కాలం నుంచి బ్రతికే ఉంది అంటే నమ్మకం కలగటంలేదు కదూ..పర్యవారణ వేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆండీస్ పర్వతాలపై విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ..అతి నెమ్మదిగా పెరుగుతోంది.దాన్ని చూస్తే రాతి మీద పరుచుకున్న పచ్చటి గడ్డి అనుకుంటాం. కానీ అది ఒక మొక్క జాతికి చెందినదేనని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
‘యరేటా’ మొక్క స్పెషల్