Yes, I Was Playboy.. Imran Khan On Pak Ex Army Chief's Dig
Imran Khan: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రిక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘అవును, అవన్నీ నిజమే, అయితే ఇప్పుడేంటి?’’ అన్న విధంగా ఇమ్రాన్ స్పందించడం పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. తనను పాక్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలను తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఇమ్రాన్ ఊటంకించారు. బజ్వా వ్యాఖ్యలు వాస్తవమంటూనే, ఇలాంటి వ్యాఖ్యలతో పాకిస్తాన్ యువతకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.
Supreme Court: ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు? సుప్రీం సంచలన వ్యాఖ్యలు
లాహోర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు ఇమ్రాన్. గతేడాది తనపై అవిశ్వాసం పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి ముందు బజ్వా తనను ‘ప్లే బాయ్’ అని పిలిచారని గుర్తు చేశారు. అయితే తాను ప్లే బాయ్నేనని ఇమ్రాన్ ఒప్పుకున్నారు. దాంతో విమర్శకులకు వచ్చిన నష్టమేంటన్న రీతిలో ఇమ్రాన్ మండిపడ్డారు. ఇక ఇమ్రాన్‌కు సంబంధించిన మూడు ఆడియో టేపులు బయటికి వచ్చాయి. రానున్న రోజుల్లో వీడియో రికార్డులు కూడా వస్తాయని కొందరు అంటున్నారు. ఇప్పటికే విడుదలైన టేపులపై పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా స్పందిస్తూ అవి వాస్తవమేనని స్పష్టం చేశారు.
వీటన్నిటిపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘‘ఆగస్టు 2022లో జనరల్ బజ్వాతో జరిగిన సమావేశంలో, నా పార్టీ సభ్యుల ఆడియోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని నాకు చెప్పాడు. నేను ‘ప్లేబాయ్’ అని కూడా అతను నాకు గుర్తు చేశాడు. నేను అతనికి చెప్పాను…అవును, నేను ప్లే బాయ్నే అని చెప్పాను. అయితే అది గతం. అలా అని నేనెప్పుడూ దేవదూతని అని చెప్పుకోలేదు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘అతను డబుల్ గేమ్ ఆడుతున్నాడని తెలుసుకున్నాను. షెహబాజ్ బజ్వా నాకు వెన్ను పోటు పొడిచాడు” అని తీవ్రంగా ఆరోపించారు.