Grammy 2021 : ’ఐ స్టాండ్‌ విత్‌ ఫార్మర్స్’ మాస్క్ ధరించిన లిల్లీ సింగ్

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ ఈవెంట్ లో ప్రముఖ స్టార్ యూ ట్యూబర్ లిల్లీ సింగ్ అట్రాక్షన్ గా నిలిచారు.

Grammy Awards

YouTuber Lilly Singh : ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ ఈవెంట్ లో ప్రముఖ స్టార్ యూ ట్యూబర్ లిల్లీ సింగ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈమె ధరించిన మాస్క్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే..ఆమె మాస్క్ పై ‘I STAND WITH FARMERS‘ అని రాసి ఉండడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ లో 63వ గ్రామీణ అవార్డు వేడుకలు జరిగాయి. నల్లని సూట్‌ ధరించిన లిల్లీ ‘ఐ స్టాండ్‌ విత్‌ ఫార్మర్స్‌’ అని రాసి ఉన్న మాస్క్‌ను వేసుకొని రెండ్‌ కార్పెట్‌పై ఫోటోలకు పొజులిచ్చారు. ‘అవార్డు వేడుకల్లో రెడ్‌ కార్పెట్‌పై దిగే ఫోటోలకు మీడియా కవరేజ్‌ అధికంగా ఉంటుందని తెలుసు. అందుకే మీరు మీడియా ముందుకు వచ్చి స్వేచ్ఛగా రైతులకు మద్దతు ప్రకటించండి’ అంటూ కామెంట్‌ జత చేశారు. షేర్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ 1,30,467 మంది లైక్ చేయడం విశేషం.

భారతదేశంలోని ఢిల్లీలో గత కొన్ని నెలలుగా వ్యవసాయ రైతులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరికి జాతీయ, అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న సెలబ్రెటీలు మద్దతు తెలియచేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై భారత్ స్పందించింది కూడాది. కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఇక లిల్లీ సంగతి విషయానికి వస్తే..ఈమెకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. యూట్యూజ్‌ షోస్‌‌తో అమెరికాలో పాపులర్ అయ్యారు. 31ఏళ్ల లిల్లీసింగ్.. టొరొంటో లోని యార్క్ యూనివర్శిటీలో డిగ్రి చదివారు. 2010 నుంచి యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతూ..పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. 2017లో ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో యూట్యూబ్ ద్వారా అత్యంత ఎక్కువ సంపాదించే వ్యక్తుల్లో లిల్లీ పదో స్థానంలో నిలిచారు.