Zakir Naik: జాకీర్ నాయక్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నిషేదం ఐదేళ్లు పొడిగింపు

ప్రస్తుతం జాకీర్ మలేసియాలో ఉన్నారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ 1967 చట్ట ప్రకారం.. 2016లో తొలిసారిగా IRFపై నిషేదాన్ని ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా...

Zakir Naik

Zakir Naik: జాకీర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ను మరో ఐదేళ్ల పాటు నిషేదిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం జాకీర్ మలేసియాలో ఉన్నారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ 1967 చట్ట ప్రకారం.. 2016లో తొలిసారిగా IRFపై నిషేదాన్ని ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయంటూ.. దేశానికి సంబంధించిన సెక్యూలర్ ఫ్యాబ్రిక్ చెడిపోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

‘ఐఆర్ఎఫ్ తో పాటు దాని సభ్యులను ప్రత్యేకించి జాకీర్ అబ్దుల్ కరీమ్ నాయక్ అలియాస్ జాకీర్ నాయక్ లు మతం పేరుతో ఇతర మతస్థులపై ద్వేషం పెంచుతున్నారని.. పలు మతాల మధ్య, కమ్యూనిటీల మధ్య బేధాభిప్రాయాలు వచ్చేలా చేస్తున్నారని ప్రభుత్వం అభిప్రాయపడింది. దేశ క్షేమం కోసం, సెక్యూరిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది’

………………………………………… : ‘అఖండ’ ట్రైలర్‌లో త్రివిక్రమ్!..

‘లౌకిక దేశంలో నాయక్ కార్యకలాపాలు ప్రజల మెదళ్లను కలుషితం చేస్తున్నాయని.. మతపరమైన బేధాలు సృష్టించి, దేశ విద్రోహ సెంటిమెంట్లను లేవనెత్తుతున్నారని.. వాటికి ఆకర్షితులై కొందరు దేశ భద్రతను విస్మరిస్తున్నారని చెప్పారు. ఈ కారణం చేతనే చట్ట విరుద్ధమైన ఈ అసోసియేషన్ గురించి తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి రావాలని ఆదేశాలిచ్చారు’ అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

నాయక్ ఇంటర్నేషనల్ టీవీ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ప్రింట్, సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.