ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2020 సీజన్లో అంచనాలు తారుమారైన మాట వాస్తవమే. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ సీజన్లో ఢిల్లీ 9గేమ్‌లలో 14పాయింట్లు సాధించి లీగ్ పట్టికలో టాప్ పొజిషన్‌లో ఉంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ గెలిచి ఈ ఫీట్ సాధించింది.
మరోవైపు సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ .. రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసి ఏడో ఓటమిని చవిచూసింది. ఈ సమయంలో సీఎస్కే దాదాపు ప్లే ఆఫ్ అంచుల్లో నిలిచినట్లే.. అయినా టాప్ 4లో నిలబడేందుకు ఇంకా అవకాశం పోలేదు.
https://10tv.in/chennai-super-kings-rajasthan-royals-look-to-revive-their-campaigns-with-time-running-out/
గణాంకాల ప్రకారం చూస్తే చెన్నైకు మరో ఓటమి చూస్తేనే ప్లే ఆఫ్ బెర్త్ కోల్పోతుంది. రాజస్థాన్ రాయల్స్ సోమవారం మ్యాచ్ తర్వాత ఐదో పొజిషన్ కు చేరింది. తప్పక గెలవాల్సిన అవకాశాన్ని వాడుకుంది. పది గేమ్స్ లో కేవలం 8పాయింట్లు సాధించిన రాజస్థాన్ టాప్ 4లో నిలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంది.
చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్ లు ప్లే ఆఫ్ కు చేరాలంటే ఏం జరగాలి.. ఓ లుక్కేయండి
చెన్నై సూపర్ కింగ్స్ : చారిత్రాత్మకమైన పరాజయాన్ని ఎదుర్కొంటుంది ధోనీ సేన. పది గేమ్స్ లో ఏడింటిని ఓడిపోయింది. పాయింట్ల టేబుల్ లో సీఎస్కే చివరి స్థానంలో ఉంది. ఈ కాంపిటీషన్ లో కొనసాగాలంటే మిగిలింది ఒకే ఒక్క అవకాశం. మిగిలిన 4గేమ్స్ గెలవడమే నెక్స్ట్ టార్గెట్. ఇంకొక్క మ్యాచ్ ఓడిపోయినా.. ప్లే ఆఫ్ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్లే. కానీ, సీఎస్కే ఫలితాలనేవి ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉన్నాయి. అంటే చెన్నై ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే.. ప్లే ఆఫ్ బెర్త్ పోటీలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, సన్‌రైజర్స్ మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే సాధ్యపడుతుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: పంజాబ్ పరిస్థితి కూడా ధోనీసేన లాగే ఉంది. కేఎల్ రాహుల్ & కో కష్టం గెలుపు అంచుల వరకూ వెళ్లినా విజేతను చేయలేకపోతుంది. 9 మ్యాచ్ లలో మూడింటిని కోల్పోయింది రాహుల్ జట్టు. ఈ జట్టుకు కూడా ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. మిగిలిన ఐదు గేమ్స్ గెలిస్తే టాప్ 4కు వెళ్లే అవకాశం ఉంది. ఏ ఒక్కటి ఓడినా ఆశలు వదులుకోవాల్సిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పంజాబ్ తో పాటు సమానమైన పాయింట్లతో రాణిస్తుంది సన్‌రైజర్స్. బెటర్ రన్ రేట్ కోసం ప్రయత్నిస్తూ.. టేబుల్ లో చివరి స్థానాల్లోకి దిగజారింది. హైదరాబాద్ కు బెటర్ రన్ రేట్ ఉండటంతో ప్లే ఆఫ్ కు వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ కూడా ఐదు గేమ్స్ గెలిస్తేనే అది సాధ్యపడుతుంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడినా నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్ కు వెళ్లడం పక్కాగా కనిపిస్తుంది.