×
Ad

IPL 2021 KKR Vs MI : కోల్‌కతా టార్గెట్ 153..5 వికెట్లతో అదరగొట్టిన రస్సెల్

ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో(36

  • Published On : April 13, 2021 / 09:20 PM IST

Ipl 2021 Kkr Vs Mi Kolkata Target

IPL 2021 KKR Vs MI : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ సేన తేలిపోయింది. బ్యాట్ తో పెద్దగా రాణించలేకపోయింది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో(36 బంతుల్లో 56 పరుగులు) రాణించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేదు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోల్ కతా జట్టు 153 పరుగులు చేయాలి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ 5 వికెట్లు తీసి ముంబై వెన్ను విరిచాడు. కోల్ కతా బౌలర్లు ముంబై బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. పరుగుల వరద పారించకుండా అడ్డుకున్నారు.