IPL 2021 KKR Vs MI ముంబై ఘన విజయం.. మ్యాచ్ మలుపు తిప్పిన చాహర్
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. లో స్కోర్ చేసినా.. కాపాడుకోగలిగింది.
- Naveen
- Published On : April 13, 2021 / 11:25 PM IST
Mumbai Indians
IPL 2021 KKR Vs MI : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. లో స్కోర్ చేసినా.. కాపాడుకోగలిగింది. కట్టుదిట్ట మైన బౌలింగ్ తో కోల్ కతాను కట్టడి చేసింది. 10 రన్స్ తేడాతో ముంబై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో టోర్నీలో బోణీ చేసింది.
ముంబై బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ అద్భుతంగా బౌల్ చేశాడు. 4 వికెట్లు తీసి కోల్ కతాను కట్టడి చేశాడు. 153 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకానొక స్టేజిలో కోల్ కతా ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ముంబై బౌలర్ చాహర్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. కోల్ కతా ఓపెనర్ నితీష్ రానా హాఫ్ సెంచరీతో(46 బంతుల్లో 57) రాణించాడు. అతడి పోరాటం వృథా అయ్యింది. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 33 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు.
Rahul Chahar is on a roll here. Four wickets for the leg-spinner.
Live – https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL | @rdchahar1 pic.twitter.com/ZEjDlZVrun
— IndianPremierLeague (@IPL) April 13, 2021
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా రస్సెల్ 5 వికెట్లు తీశాడు. లో స్కోర్ కావడంతో కోల్ కతా గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ, ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి విజయం సాధించారు. ముంబై బౌలర్లలో చాహర్ 4 వికెట్లు తియ్యగా బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.
స్కోర్లు
ముంబై-152/10
కోల్ కతా – 142/7
