AP Dsc 3000 Posts : నిరుద్యోగులకు శుభవార్త.. 3,004 పోస్టులతో Dsc నోటిఫికేషన్…!

AP Dsc 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. తర్వలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది.

ap dsc 2026 government will plan to recruit more than 3000 teacher posts soon

AP Dsc 2026 : టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలోనే 3 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ పోస్టుల భర్తీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనుంది. ఉగాది సందర్భంగా మార్చి 19న జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలో త్వరలోనే 3,004 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అతి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం. ఈ మొత్తం పోస్టుల్లో 1,744 ఎస్జీటీలు (SGT) ఉండనున్నాయి. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్‌తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసే ఈ జాబ్ క్యాలెండర్‌లో ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖల్లో అత్యధిక పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విభాగాల్లో 3,000కు పైగా పోస్టులు, పోలీస్ శాఖలో 3,000 ఎస్సై (SI), కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.