Telugu » Jobs » Ap Wdcw One Stop Center Jobs 2026 Notification For Srikakulam Full Details Dhy
AP WDCW Jobs 2026: ఉమెన్స్ డే వేళ బంపరాఫర్.. ఏపీలోని ఆ జిల్లాలో కేవలం మహిళలకు మాత్రమే ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే..
AP WDCW Jobs 2026 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ జిల్లాలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే వీటికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు.
AP WDCW one stop center jobs 2026 notification for srikakulam full details
AP WDCW Jobs : ఉమెన్స్ డే వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఓ జిల్లా మహిళలకు శుభవార్త చెప్పింది. పలు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. పైగా ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంతకు ఈ ఉద్యోగాల భర్తీ ఎక్కడటంటే శ్రీకాకుళం జిల్లాలోని వన్ స్టాప్ సెంటర్ లో. శ్రీకాకుళంలోని రాష్ట్ర ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ (WDCW) ఆధ్వర్యంలో One Stop Centreలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 13, 2026 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ (WDCW) పథకం మిషన్ వాత్సల్య కింద శ్రీకాకుళం జిల్లాలో పలు పోస్టులను భర్తీ చేయనుంది.
అప్లికేషన్ విధానం – ఆఫ్ లైన్
ఎంపిక విధానం – ఇంటర్వ్యూ
మొత్తం ఖాళీలు 13
జీతం రూ. 13,000 – రూ. 34,000
చివరి తేదీ 13 మార్చ్, 2026
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టు పేరు ఖాళీలు
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ 1
సైకో సోషల్ కౌన్సిలర్ 1
కేస్ వర్కర్ 2
పారా లీగల్ పర్సనల్ / లాయర్ 1
పారా మెడికల్ పర్సనల్ 1
ఆఫీస్ అసిస్టెంట్ (కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి) 1
సెక్యూరిటీ గార్డ్ 3
మల్టీ పర్పస్ స్టాఫ్ / కుక్ 3
విద్యార్హతలు
పోస్టు ఆధారంగా అభ్యర్థులు కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
ప్రధాన విద్యార్హతలు
లా (LLB / LLM)
సోషల్ వర్క్ (MSW)
సోషియాలజీ
సైకాలజీ
డిప్లోమా / డిగ్రీ / పీజీ
సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత పనిలో అనుభవం
వయస్సు పరిమితి
కనిష్ట వయస్సు 18 / 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
కొన్ని పోస్టులకు 30–45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపులు ఉండవచ్చు.
జీతం
పోస్టు జీతం
హెల్పర్ / చౌకీదార్ రూ. 7,944
కుక్ రూ. 9,930
టీచర్స్ (పార్ట్ టైం) రూ. 10,000
కేస్ వర్కర్ రూ. 19,500
కౌన్సిలర్ రూ. 20,000
అడ్మినిస్ట్రేటీవ్ పోస్టులు రూ. 34,000 వరకు
ఎంపిక విధానం
ఈ నియామకాలకు రాత పరీక్ష ఉండదు.
ఎంపిక విధానం
దరఖాస్తుల పరిశీలన
అభ్యర్థుల షార్ట్ లిస్ట్
వ్యక్తిగత ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి ఫీజు రూ. 250
SC / ST / BC క్యాండిడేట్లకు రూ. 200
అవసరమైన పత్రాలు
పదో తరగతి మెమో
విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు
స్టడీ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్
ఆధార్ కార్డ్
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.
Step 1: అధికారిక జిల్లా వెబ్‌సైట్‌కి వెళ్లాలి
Step 2: Application Form డౌన్‌లోడ్ చేసుకోవాలి
Step 3: ఫారం పూర్తిగా నింపాలి
Step 4: అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి
Step 5: అప్లికేషన్‌ను పోస్టు ద్వారా లేదా ప్రత్యక్షంగా సమర్పించాలి
దరఖాస్తులను ఈ అడ్రస్‌కు పంపాలి:
District Women Development & Child Welfare Officer Office
Srikakulam District
Andhra Pradesh