RRB ALP Recruitment 2026 : నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 11 వేలకు పైగా ఉద్యోగాలు.. పది పాస్ అయితే చాలు.. అస్సలు వదులుకోకండి
RRB ALP Recruitment 2026 : నిరుద్యోగులకు పండగలాంటి వార్త. 11 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రెడీ అయ్యింది.
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 02:14 PM IST
RRB ALP recruitment 2026 Notification released for 11127 Assistant Loco Pilot Posts full details here
RRB ALP Recruitment 2026 :
నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. దాదాపు 11 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనుంది. దీని కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. పది, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే నెలలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా సికింద్రాబాద్‌తో పాటు:
- అహ్మదాబాద్,
- అజ్మేర్,
- బెంగళూరు,
- భోపాల్,
- భువనేశ్వర్,
- బిలాస్‌పూర్,
- చండీగఢ్,
- చెన్నై,
- గోరఖ్‌పూర్,
- గువాహటి,
- జమ్ము అండ్ శ్రీనగర్,
- కోల్‌కతా,
- మాల్దా,
- ముంబై,
- ముజఫర్‌పూర్,
- పట్నా,
- ప్రయాగ్‌రాజ్,
- రాంచీ,
- సిలిగురి,
- తిరువనంతపురం..
రైల్వే ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
అర్హత
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాలు, ట్రేడుల్లో ఐటీఐ (ITI), డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు
- దరఖాస్తుదారుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 14, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ రాత పరీక్ష (సీబీటీ 1, సీబీటీ 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతం
ఎంపికైన వారికి నెలకు రూ. 19,900 చొప్పున ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్స్‌లు అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 15, 2026.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14, 2026.
