RRB ALP 2026 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 11 వేలకు పైగా ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు..!
RRB ALP 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధం అయ్యింది.
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 04:25 PM IST
RRB ALP recruitment 2026 Notification released for 11127 Assistant Loco Pilot vacancies details here
RRB ALP 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనుంది. 2026 మార్చి 16న దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ లెవల్-2 ఉద్యోగాలకు ప్రారంభ ప్రాథమిక జీతం నెలకు రూ. 19,900 కాగా, దీనికి అదనంగా డీఏ (DA), హెచ్‌ఆర్‌ఏ (HRA) వంటి అలవెన్సులు కూడా ఉంటాయి. వీటితో పాటు పెన్షన్, మెడికల్ సదుపాయాలు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. మే 15 నుంచి ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
- పోస్ట్ పేరు– అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
- మొత్తం ఖాళీలు– 11,127షార్ట్
- నోటిఫికేషన్ విడుదల– మార్చి 16, 2026
- పూర్తి నోటిఫికేషన్ విడుదల- మే 14, 2026
- దరఖాస్తు ప్రారంభం- మే 15, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ– జూన్ 14, 2026 (రాత్రి 11:59 వరకు)
- దరఖాస్తు విధానం-ఆన్‌లైన్
- అధికారిక వెబ్‌సైట్- rrbapply.gov.in
గమనిక: ఈ నియామక ప్రక్రియను ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి వివిధ RRBలు నిర్వహిస్తాయి.
అర్హతలు:
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత ట్రేడ్స్‌లో ITI సర్టిఫికేట్ లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
- లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ విభాగాల్లో 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి (జూలై 1, 2026 నాటికి):
- కనిష్ట వయసు: 18 సంవత్సరాలు.
- గరిష్ట వయసు: 30 సంవత్సరాలు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ:
- rrbapply.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ‘Apply’ సెక్షన్‌లోకి వెళ్లి, కొత్త వారైతే రిజిస్టర్ చేసుకోవాలి.
- ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు లాగిన్ అవ్వాలి.అవసరమైన వివరాలతో అప్లికేషన్ ఫారమ్‌ను నింపాలి.
- ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాలి.
- నిర్దేశించిన ఫీజు చెల్లించాలి (జనరల్/OBC అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఇతర వర్గాలకు మినహాయింపులు ఉంటాయి).
- ఫారమ్‌ను సమర్పించి (Submit), భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
- CBT-1 పరీక్ష (మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
- CBT-2 పరీక్ష (రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
- ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్,
- మెడికల్ టెస్ట్
పీరీక్ష తేదీలను రైల్వే శాఖ త్వరలోనే వెల్లడిస్తుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.దీనికి సంబంధించి ఏవైనా స్టడీ మెటీరియల్ లేదా పరీక్షా విధానం
