SSC JHT 2026 : డ్రీమ్ జాబ్.. నెలకు రూ.1.42 లక్షల జీతం.. హిందీ వస్తే చాలు.. తప్పకుండా ఉద్యోగం

SSC JHT 2026 : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. నెలకు రూ.1.42 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ssc release notification 2026 for 84 hindi translators examination posts full details here

SSC JHT 2026 : నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి శుభవార్త. నెలకు రూ. 1.42 లక్షల జీతం వచ్చే ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మీకు హిందీ భాష మీద మంచి పట్టు ఉంటే ఈ ఉద్యోగం మీకే. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ వంటి గ్రూప్ ‘బి’ (నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు మే 14వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ వివరాలు:

పరీక్ష పేరు:

కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2026

ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య – 84

  • జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (JTO)
  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (JHT)
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ (JT)
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (SHT)
  • సీనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ (STO)

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావించే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా మాస్టర్స్ డిగ్రీ (PG) పూర్తి చేసి ఉండాలి.

  • జూనియర్ పోస్టులకు: ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ లేదా రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

  • సీనియర్ పోస్టులకు: ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ లేదా మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

జీతం (శాలరీ):

  • జూనియర్ స్థాయి పోస్టులకు: పే లెవల్-6 (రూ. 35,400 – 1,12,400).

  • సీనియర్ స్థాయి పోస్టులకు: పే లెవల్-7 (రూ. 44,900 – 1,42,400).

పరీక్షా విధానం:

ఎంపిక ప్రక్రియలో రెండు పేపర్లు ఉంటాయి:

  • పేపర్-I: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE).

  • పేపర్-II: డిస్క్రిప్టివ్ ట్రాన్స్‌లేషన్ మరియు ఎస్సే (వ్యాసం). అభ్యర్థుల ప్రతిభ, ప్రాధాన్యతల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటలు.

ఫీజు:

  • జనరల్, EWS మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ. 100.

  • ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 23.04.2026

  • దరఖాస్తులకు చివరి తేదీ: 14.05.2026

  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 15.05.2026

  • దరఖాస్తుల సవరణ (Correction) తేదీలు: 19.05.2026 నుండి 20.05.2026 వరకు.

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): ఆగస్టు – సెప్టెంబర్ 2026.

హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్: 18003093063.