SSC Grade C D Jobs 2026 : ఇంటర్ పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అస్సలు మిస్ చేసుకోకండి..

SSC Grade C D Jobs 2026 : ఇంటర్ పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.

ssc stenographer grade c d notification 2026 released

SSC Grade C D Jobs 2026 : కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 2026 సంవత్సరానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’, గ్రేడ్‌ ‘డీ’ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అలానే దీని ద్వారా స్టెనోగ్రాఫర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు మే15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 731

పోస్టులు:

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ (గ్రూప్ బి, నాన్-గెజిటెడ్)
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ (గ్రూప్ సి)

ముఖ్యమైన అర్హతలు:

విద్యార్హత:

01-08-2026 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

నైపుణ్యం:

అభ్యర్థులకు ఖచ్చితంగా స్టెనోగ్రఫీ (Stenography) లో నైపుణ్యం ఉండాలి.

వయోపరిమితి :

  • గ్రేడ్ ‘సి’: 18 – 30 ఏళ్లు (02-08-1996 నుంచి 01-08-2008 మధ్య జన్మించి ఉండాలి).
  • గ్రేడ్ ‘డి’: 18 – 27 ఏళ్లు (02-08-1999 నుంచి 01-08-2008 మధ్య జన్మించి ఉండాలి).
  • సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం (CBT):

మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.

అంశాలు

  • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 50 మార్కులు.
  • జనరల్ అవేర్‌నెస్: 50 మార్కులు.
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్: 100 మార్కులు.
  • పరీక్ష సమయం: 2 గంటలు.

నెగటివ్ మార్కింగ్:

ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత ఉంటుంది.

స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్:

  • రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు:
  • గ్రేడ్ ‘C’: నిమిషానికి 100 పదాల వేగం.
  • గ్రేడ్ ‘D’: నిమిషానికి 80 పదాల వేగం.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 100/-
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికోద్యోగులకు: ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభం: 24-04-2026.
  • చివరి తేదీ: 15-05-2026.
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: 16-05-2026.
  • దరఖాస్తు సవరణ (Correction window): 20-05-2026 నుంచి 21-05-2026 వరకు.
  • పరీక్ష తేదీలు: జులై – ఆగస్టు 2026.