SSC Selection Post Phase 14 Jobs : 3,003 ఉద్యోగాల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకొండి..!
SSC Selection Post Phase 14 Notification 2026 : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలని భావించే వారికి ఎస్ఎస్సీ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది.
- Dharani Pilli
- Updated on- April 16, 2026 / 02:24 PM IST
SSC Selection Post Phase 14 Jobs 2026 For 3003 Vacancies
SSC Notification 2026 : నిరుద్యోగలకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ లోని పలు మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఫేజ్ XIV/2026 సెలెక్షన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఖాళీగా టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీటిలో గ్రూప్–బీ, గ్రూప్–సీ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.
ఈ నియమాకాలపై ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఏప్రిల్ 13 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు తాత్కాలిక తేదీ 2026 జూన్‌లో నిర్వహించబడతాయని తెలిపారు. దీనిపై అధికరి ప్రకటన వెలువడాల్సి ఉంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం ఖాళీలు:
3,003 పోస్టులు
దరఖాస్తు తేదీలు:
ఏప్రిల్ 13, 2026 నుంచి మే 3, 2026 వరకు
దరఖాస్తు ఫీజు:
- సాధారణ / OBC అభ్యర్థులకు ₹100
- మహిళలు, SC, ST, PwBD, మాజీ సైనికులకు ఫీజు లేదు
అర్హతలు:
10వ తరగతి, ఇంటర్ (12వ తరగతి), డిగ్రీ ఉత్తీర్ణత (పోస్టును బట్టి)
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
వయోపరిమితి:
- పోస్టును బట్టి మారుతుంది
- SC/STలకు 5 సంవత్సరాలు,
- OBCలకు 3 సంవత్సరాలు,
- PwBDలకు 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపు
ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/home ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వర్గాల వారీగా ఖాళీలు (సుమారు):
- UR: 1,534 పోస్టులు
- OBC: 667 పోస్టులు
- SC: 346 పోస్టులు
- ST: 185 పోస్టులు
- EWS: 271 పోస్టులు
ఈ నియామకాల్లో అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, అటెండెంట్లు వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలకు SSC అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
