Tirupati SVIMS Recruitment 2026 : తిరుపతి SVIMSలో ఉద్యోగాలు.. పది పాస్ అయితే చాలు.. రాత పరీక్ష లేకుండానే.. జాబ్ పక్కా..!

Tirupati SVIMS Recruitment 2026 : తిరుపతిలోని నిరుద్యోగులకి శుభవార్త.. స్విమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

tirupati svims recruitment 2026 for various posts under contract based full details here

Tirupati SVIMS Recruitment 2026 : మీరు తిరుపతిలో నివాసం ఉంటున్నారా.. ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే బాగుండు అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయితే చాలు.

పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, ఎంబీబీఎస్ ఇలా పలు అర్హతల వారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు.. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, పీఆర్ఓ, సోషల్ వర్కర్, టెక్నీషియన్లు కలిపి మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనుంది.

పోస్టుల వివరాలు:

  • మెడికల్ ఆఫీసర్ – 1
  • స్టాఫ్ నర్స్ – 1
  • ఏఎన్ఎం – 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 1
  • ఎలక్ట్రీషియన్ – 1
  • డ్రైవర్ – 1
  • టెక్నీషియన్లు – 2
  • పీఆర్‌ఓ – 1
  • సోషల్ వర్కర్ – 1

మొత్తం ఖాళీల సంఖ్య – 10

అర్హత:

పోస్టులను బట్టి.. సంబంధిత విభాగాల్లో టెన్త్‌/ ఐటీఐ/ డిగ్రీ/ బీఎస్సీ/ ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు గతంలో పని చేసిన అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:

47 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు చివరి తేదీ:

15-04-2026

ఇంటర్వ్యూ తేదీలు:

ఏప్రిల్ 15, 16 (2026)

వేదిక:

  • కమిటీ హాల్,
  • పాత డైరెక్టర్ కార్యాలయం,
  • శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌వీఐఎంఎస్),
  • అలిపిరి రోడ్డు,
  • తిరుపతి,
  • ఆంధ్రప్రదేశ్.