Accident In Krishna District
Accident In Krishna District : ఘోరం. విషాదం. గుండె కోత. ఇలాంటి ఎన్ని పదాలు వాడినా సరిపోవేమో. నిన్నటివరకు సంతోషాలు నిండిన ఆ ఇంట్లో.. ఈ ఉదయం ఒక్కసారిగా విషాదం కమ్ముకుంది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న చిట్టితల్లి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ కన్నవారికి సంతోషాలు పంచిన ఆ చిన్నారి… శాశ్వతంగా కన్నుమూసింది. ప్రాణం ఎంతలో పోతుందో అని చెప్పేందుకు…. ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదు అనేందుకు .. ఈ సంఘటనే ఓ ఉదాహరణ.
Mangalore : హాస్టల్ గదిలో యువతిపై అత్యాచారం
కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో ఈ ఉదయం దారుణ సంఘటన జరిగింది. 11నెలల చిన్నారి కీర్తిప్రియ ఎప్పటిలాగే ఆడుకుంటోంది. ఇంట్లో టీవీ నడుస్తోంది. టీవీ చూస్తూ… అందులో వచ్చే బొమ్మలు చూస్తూ.. చిరునవ్వులు చిందిస్తోంది ఆ చిన్నారి. ఐతే… ఏం జరిగిందో తెలియదు … అంతలోనే.. టీవీ ఆమెపై పడింది. ఆడుకుంటున్న చిన్నారి కీర్తిప్రియపై టీవీ కొంత ఎత్తుపై నుంచి పడటంతో.. ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్పాట్ లోనే చిన్నారి కన్నుమూయడంతో…. ఆ తల్లిదండ్రుల గుండెకోతకు అంతులేకుండా పోయింది.
Marriage : కట్నం ఇవ్వలేదని వేరే యువతితో పెళ్లి.. సీఎం కాన్వాయ్ డ్రైవర్ పై కేసు నమోదు!
మరో నెలరోజుల్లో పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేద్దామనుకున్నాం కానీ… ఇంతలోనే నిండు నూరేళ్లు నిండుతాయనుకోలేదు అంటూ గుండెలవిసేలా రోదించారు ఐనవాళ్లు. కన్నవారి ఆక్రందన చూసి గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.