Mega Family: 2021 సంవత్సరం సినీ ప్రియులకు గుర్తుండిపోయే ఇయర్.. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి.. సంక్రాంతి నుండి కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. మూవీ లవర్స్ సంగతి పక్కన పెడితే మెగా ఫ్యాన్స్‌కి ఈ ఏడాది చాలా స్పెషల్.. ఎందుకంటే ఆ కుటుంబానికి చెందిన అందరి హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ టాక్, రికార్డ్ స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో డెబ్యూ మూవీతో హైయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 9న పవర్‌స్టార్ ‘వకీల్ సాబ్’ గా థియేటర్లలో దర్శనమివ్వనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ‘ఆచార్య’ మే 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చరణ్ ఓ ప్రత్యేకపాత్రలో కనిపించనున్నాడు.
తర్వాత జూన్ నెలలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీతో రాబోతున్నాడు. దేవ కట్టా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తర్వాత తేజ్ నటిస్తున్న సినిమా ఇది.
జూలైలో ‘గని’ మూవీతో మెగా ప్రిన్స్ వస్తున్నాడు. వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్న ‘గని’ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ తన రిలేటివ్‌తో కలిసి ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్‌లోకి అడుగు పెడుతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలిం ‘పుష్ప’.. బన్నీ కెరీర్‌లో ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఆగస్టు 13న ‘పుష్ప’ రిలీజ్ అవుతోంది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో, సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12 గా నిర్మిస్తున్న చిత్రం సెప్టెంబర్‌లో షెడ్యూల్ అయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’.. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13 న ఈ చిత్రం విడుదల కానుంది.