29th Wedding Anniversary Of King Nagarjuna And Amala
Nagarjuna – Amala: వయసు పెరుగుతున్నా వన్నెతరగని నవ ‘మన్మథుడు’, ‘కింగ్’ నాగార్జున, అమల జూన్ 11న తమ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. వీరి వైవాహిక బంధానికి 29 సంవత్సరాలు.. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు నాగ్, అమల అరుదైన ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేశారు.
నాగార్జున – అమల కలిసి ‘ప్రేమ యుద్ధం’, ‘శివ’, ‘కిరాయి దాదా’, ‘నిర్ణయం’, ‘చినబాబు’ సినిమాల్లో నటించారు. 1992 జూన్ 11న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. నాగ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఫ్యాన్స్, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవలే బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు నాగ్..