జీతాల ఆలస్యంపై కలత చెందుతున్న కోవిడ్ యోధులు

  • Publish Date - June 21, 2020 / 06:22 AM IST

వారంతా కోవిడ్ యోధులు. కరోనా వైరస్ సోకిన రోగికి ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు ఎంతో మంది వైద్య సిబ్బంది. అందులో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతో మంది ఉన్నారు. ఇందులో పర్మినెంట్ కొంతమంది ఉంటే..కాంట్రాక్టు విధానంలో మరికొంతమంది పనిచేస్తున్నారు.

తాము ఇంత శ్రమ పడుతున్నా..జీతాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ..400 మంది డాక్టర్లు, నర్సులు కలత చెందుతున్నారు. తమను అసలు గుర్తించడం లేదని కాంట్రాక్ట్ విధానం కింద పనిచేస్తున్న వీరంటున్నారు. వీరంతా…పూణేకు చెందిన వారు. 

YCM ఆసుపత్రిలో పలువురు వైద్యులు పనిచేస్తున్నారు. కోవిడ్ 19 రోగికి తాము సేవలు చేస్తున్నా PCMC’S తమను గుర్తించడం లేదని కాంట్రాక్టు విధానం కింద పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

YCM, భోసారి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రతి నెలా అందాల్సి జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని, ఒక్కో నెల 15 తేదీలోపు..లేదా 15వ తేదీ తర్వాత..అందచేస్తున్నారని వాపోతున్నారు. పర్మినెంట్ వారికి ధీటుగా తాము పనిచేస్తున్నామంటున్నారు కొంతమంది. 24 గంటల పాటు తాము శ్రమిస్తూ..రోగులకు వైద్య సహాయం అందిస్తున్నామన్నారు.

PPE Kits ఒకసారి వేసుకున్న తర్వాత..తాము ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. కోవిడ్ వార్డులో ఉన్నప్పుడు కనీసం 8 గంటల పాటు నీళ్లు తాగకుండా, టాయిలెట్ కు వెళ్లలేమన్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నా..తాము రోగులకు చికిత్స అందిస్తామన్నారు.

జూన్ 20వ తేదీ గడిచిపోయినా..ఇంతవరకు తమకు జీతాలు అందలేదని, దీంతో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. పుస్తకాలు కొనడానికి, పిల్లల పాఠశాలల ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని వెల్లడించారు. బ్యాంకుకు వెళ్లి జీతం విషయం అడిగితే..ఇంకా క్రెడిట్ కాలేదని సిబ్బంది వెల్లడిస్తున్నారని తెలిపారు.

దీనిపై YCM ఆసుపత్రి డీన్ డా.రాజేంద్ర స్పందించారు. లాక్ డౌన్ పీరియడ్ లో తాము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నామని, సోమవారం జీతాలు అందచేయాలని తాము అకౌంట్స్ డిపార్ట్ మెంట్ కు సూచించడం జరిగిందన్నారు.

YCH ఆసుపత్రిలో 550 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు, నర్సులు, క్లాస్ – 4 ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. పర్మినెంట్, కాంట్రాక్టు వారికి జీతాల చెల్లింపులో కొన్ని అంశాలున్నాయన్నారు. 

Read: కరోనా భయం : ఫేస్ షీల్డ్, మాస్క్‌తో డ్యూటీ చేస్తున్న మహిళా రైలు డ్రైవర్