Corona In India : ఒక్కరోజే 51,667 కొత్త కరోనా కేసులు..1329మంది మృతి
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసు సంఖ్య ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతూ ఉన్నాయి. బుధవారం (23,2021)24న 54,069 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే కేసులు ఒక్కరోజులోనే కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.
- nagamani
- Published On : June 25, 2021 / 11:16 AM IST
Corona Cases In India
india Corona Updates : దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసు సంఖ్య ఒకరోజు పెరుగుతూ మరోరోజు తగ్గుతు ఉన్నాయి. బుధవారం (23,2021)24న 54,069 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే కేసులు ఒక్కరోజులోనే కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం నాడు 51,667 కరోనా కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 1329మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 3,93,310కు చేరింది. 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. అలాగే కరోనా సోకి కోలుకుంటున్నవారు 24 గంటల్లో 64,527 మంది కోలుకున్నారు.
6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స కొనసాగుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,95,68,448 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,35,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
