గుంటూరు, కృష్ణాలో భారీగా కరోనా కేసులు, రెండు జిల్లాల మధ్య రాకపోకలు బంద్

  • Publish Date - May 2, 2020 / 10:02 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 1525కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1051 గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకు 441 మంది కరోనా నుంచి కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లా 308 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కూడా 258 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలు ఉండగా… ఒక్క విజయనగరం మాత్రమే కరోనా ఫ్రీ జిల్లాగా ఉంది. కాగా కర్నూలు జిల్లాలోనే 25 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 3 రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ తో ఎలాంటి మరణం సంభవించ లేదు.

గుంటూరు, కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య జిల్లాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వారధి మీద నుంచి సరిహద్దు ప్రాంతాలకు రాకపోకలను నిలిపివేశారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. సాధారణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు. రెడ్ జోన్లలోని ప్రాంతాలను పోలీసులు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. 

అనంతపురం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 4 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 24 గంట్లలో 5వేల 943 శాంపుల్స్ ని పరీక్షించగా 62మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గడిచిన 24 గంటల్లో 38మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.(ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్)