ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 06:25 AM IST
ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్

ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1525కి చేరింది. ఇప్పటివరకు 441 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1051. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది కరోనాతో మరణించారు. 

5వేల 943 శాంపుల్స్ ని పరీక్షించగా 62మందికి కరోనా:
కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 12, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంట్లలో (శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9) 5వేల 943 శాంపుల్స్ ని పరీక్షించగా 62మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 38మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

436 కరోనా కేసులతో కర్నూలు టాప్:
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లా 308 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 258 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలు ఉండగా, ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే కరోనా ఫ్రీగా ఉంది. కాగా, ఇవాళ్టి లెక్కల్లో కర్నూలు జిల్లాలోనే 25 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఎలాంటి మరణం సంభవించ లేదు.
covid

Also Read | ఏపీలో కరోనా : హెల్త్ బులెటిన్ విడుదల..కొత్తగా 60 కేసులు..ఇద్దరు మృతి