Bag
Maharashtra: ఓ ఎమ్మెల్సీ ఇంటి ముందు బ్యాగును వదిలివెళ్ళాడో వ్యక్తి. ఆ బ్యాగును తెరిచి చూస్తే దాని నిండా డబ్బు, పలు వస్తువులు ఉన్నాయి. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇంటి ముందుకు వచ్చిన ఓ వ్యక్తి ఇవాళ ఉదయం 6 గంటలకు ఓ బ్యాగుతో తిరుగుతూ కనపడ్డాడు. దీంతో ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడి వద్దకు వెళ్ళే ముందే అతడు తన వద్ద ఉన్న బ్యాగును అక్కడే వదిలేసి పారిపోయాడు.
Gardening: తోటపని చేస్తే మానసిక ఆరోగ్యం
ఈ ఘటనపై ఎమ్మెల్సీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా దాని నిండా డబ్బు, నాణేలు, గణపతి ప్రతిమతో పాటు పలు వస్తువులు కనపడ్డాయి. ఆ బ్యాగును వదిలి వెళ్ళిన వ్యక్తి ఎవరన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Mumbai: A bag full of cash, coins, Ganpati idol, etc found outside BJP MLC Prasad Lad’s residence. Investigation on
Says, “Police saw a suspicious man passing by my house at 5.30-6 am. When they approached him, he fled&left the bag.Tomorrow it could be something lethal” pic.twitter.com/bvhRkebBJj
— ANI (@ANI) July 10, 2022