Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

ఫ్లోరిడా విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆరోగ్యంగా ఉన్న‌ కొంద‌రు మ‌హిళ‌ల‌తో వారానికి రెండు సార్లు తోట‌ప‌ని చేయించి వారి మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించిన వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు. తోట‌ప‌ని చేసిన వారిలో ఒత్తిడి, ఆందోళ‌న‌, కుంగుబాటు వంటివి త‌గ్గాయ‌ని చెప్పారు.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

Gardening

Gardening: మొక్క‌ల పెంప‌కం అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అయితే, మొక్క‌లు పెంచ‌డానికి త‌గిన స్థ‌లం, తీర‌క లేక‌పోవ‌డం వ‌ల్ల దానికి చాలా మంది దూరంగా ఉండాల్సి వ‌స్తుంది. ప‌ని ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి తోట‌ప‌ని చేయ‌డాన్ని ఏదో ర‌కంగా అల‌వాటు చేసుకుంటే బాగుంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అంటే, సొంత ఇంటి వ‌ద్ద తోట‌ప‌ని చేయ‌లేక‌పోయినప్ప‌టికీ బంధువులు, మిత్రుల ఇళ్ళు, ఏదైనా న‌ర్స‌రీ వ‌ద్ద‌ చేసినా ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇంత‌కుముందు మొక్క‌ల పెంప‌కం వంటి ప‌నులు అల‌వాటు లేక‌పోయిన‌ప్ప‌టికీ కొత్త‌గా అల‌వాటు చేసుకున్నా మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ప్లొస్ వ‌న్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.

Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఫ్లోరిడా విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆరోగ్యంగా ఉన్న‌ కొంద‌రు మ‌హిళ‌ల‌తో వారానికి రెండు సార్లు తోట‌ప‌ని చేయించి వారి మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించిన వివ‌రాల‌ను న‌మోదు చేసుకున్నారు. తోట‌ప‌ని చేసిన వారిలో ఒత్తిడి, ఆందోళ‌న‌, కుంగుబాటు వంటివి త‌గ్గాయ‌ని చెప్పారు. ప‌రిశోధ‌న‌లో పాల్గొన్న ఆ మ‌హిళ‌లు అంద‌రూ ఇంత‌కు ముందు తోట‌ప‌ని అల‌వాటు లేని వారేన‌ని వివ‌రించారు. మాన‌సిక‌ అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న వారు తోట‌పని చేస్తే వారికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని గ‌తంలో ప‌రిశోధ‌న‌ల్లో తేలింద‌ని, అయితే, ఇప్పుడు తాము ఆరోగ్యంగా ఉన్న‌వారు ఆ ప‌ని చేసినా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చ‌ని గుర్తించామ‌ని ఫ్లోరిడా వ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు వివ‌రించారు. తాము తాజాగా చేసిన ఈ ప‌రిశోధ‌న‌లో 26 నుంచి 49 ఏళ్ళ వ‌య‌సు మ‌ధ్య ఉన్న 32 మంది మ‌హిళ‌లు పాల్గొన్నారని చెప్పారు.