Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

కోనసీమ జిల్లాలోని అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు గుండె పోటుతో మృతి చెందారు.

Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Amalapuram: కోనసీమ జిల్లాలోని అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు గుండె పోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగా గత అర్ధ‌రాత్రి తోటి ఉద్యోగులు ముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు రామచంద్రరావు. ఆయ‌న‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ‌మ‌ధ్యంలోనే మృతి చెందారు. ఆయ‌న‌ భౌతికకాయానికి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది నివాళులు అర్పించారు. బ‌త్తుల రామ‌చంద్ర‌రావు మృతదేహాన్ని స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా గోరంతాడుకు తరలించారు.