Aaditya Thackeray on Eknath Shinde: ఏక్‭నాథ్ షిండేపై విరుచుకుపడ్డ ఆదిత్య థాకరే

కోస్టల్ రోడ్డు గురించి ఆయన స్పందిస్తూ ‘‘కోస్టల్ రోడ్డు అభివృద్ధికి ఉద్ధవ్ థకరే భూమి పూజ చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్‭లు పెడుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఎంతలా పని చేసిందో నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇందుకే కదా మనం రాజకీయాల్లోకి వచ్చిందని కోస్టల్ రోడ్డు పని చూసినప్పుడు అనిపించింది. ప్రజలకు చేయాల్సింది కూడా ఇదే కదా.. స్థిరమైన అభివృద్ధి కావాలి’’ అని ఇన్‭స్టాలో రాసుకొచ్చారు.

Aaditya Thackeray on Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేపై మాజీ మంత్రి, ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే విరుచుకుపడ్డారు. షిండేవి మురికి రాజకీయాలని, ద్రోహపూరిత విధానాలంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం తన ఇన్‭స్టాగ్రామ్‭లో గతంలో కోస్టల్ రోడ్డును సందర్శించిన ఫొటోలను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈరోజు మనం ద్రోహపూరిత, మురికి రాజకీయాల్ని చూస్తున్నాం. వారిని అందులోనే మునిగిపోనివ్వండి. మేం ప్రజలకిచ్చిన హామీల మీద నిలబడతాం’’ అని థాకరే రాసుకొచ్చారు.

ఇక కోస్టల్ రోడ్డు గురించి ఆయన స్పందిస్తూ ‘‘కోస్టల్ రోడ్డు అభివృద్ధికి ఉద్ధవ్ థకరే భూమి పూజ చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్‭లు పెడుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఎంతలా పని చేసిందో నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇందుకే కదా మనం రాజకీయాల్లోకి వచ్చిందని కోస్టల్ రోడ్డు పని చూసినప్పుడు అనిపించింది. ప్రజలకు చేయాల్సింది కూడా ఇదే కదా.. స్థిరమైన అభివృద్ధి కావాలి’’ అని ఇన్‭స్టాలో రాసుకొచ్చారు.

అటు ఉద్ధవ్ వర్గం ఇటు షిండే వర్గం మధ్య పార్టీ గుర్తు కోసం తీవ్ర రాజకీయ యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఈ కేసుపై 8న తీర్పు చెప్తామని సీజేఐ రమణ మూడు రోజుల కింద చెప్పారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలాంటిదైనా శివసేన కార్యకర్తల్ని తమతోనే ఉంచుకోవాలని ఉద్ధవ్ శిబిరం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం ఆదిత్య థాకరే మహారాష్ట్ర మొత్తం తిరుగుతూ శివసేన కార్యకర్తల్ని కలుసుకుంటున్నారు.

Sanjay Raut’s Wife At Enforcement Directorate’s Office: కుమార్తెతో క‌లిసి ఈడీ ఆఫీసుకు సంజ‌య్ రౌత్ భార్య

ట్రెండింగ్ వార్తలు