Sonu Sood : రియల్ హీరో సోనూ సూద్ కటౌట్‌కు పాలాభిషేకం..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సోనూ ఫ్యాన్స్ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. ‘‘ప్రతి ఒక్కరు సోనూ సూద్ గారిని ఆదర్శంగా తీసుకుంటే భారతదేశంలో కరోనా మరణాలు ఉండవని కోరుకుంటూ’’.. అని వ్రాసి పోస్టర్‌కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు..

Actor Sonu Sood Fans Pour Milk On His Poster

Sonu Sood: స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు.. మెకానికల్ లైఫ్‌లో పక్కవాడి గురించి ఆలోచించే వీలు కానీ, పలకరించే టైం కానీ దొరకదు.. ఇలాంటి రోజుల్లో కూడా నలుగురికి సాయం చేస్తే అబ్బో గొప్ప అనుకుంటారు.. కానీ, దాదాపు ఏడాదికి పైగా ఈ మనిషి చేతికి ఎముక లేదేమో అన్నంతగా ఇంకా ఇంకా అలుపు లేకుండా సాయం చేస్తున్న వ్యక్తికి ఏం పేరు పెడతాం?..

‘రియల్ హీరో’, ‘హెల్పింగ్ హ్యాండ్’ సాయం పొందిన వారి పాలిట ‘గాడ్’.. కరోనా స్టార్ట్ అయిన దగ్గరినుండి ఇప్పటి వరకు నిర్విరామంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న సోనూ సూద్‌కు ఇటీవల తెలంగాణ వాసి గుడి కట్టిన సంగతి తెలిసిందే..

ఇప్పుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సోనూ ఫ్యాన్స్ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. ‘‘ప్రతి ఒక్కరు సోనూ సూద్ గారిని ఆదర్శంగా తీసుకుంటే భారతదేశంలో కరోనా మరణాలు ఉండవని కోరుకుంటూ’’.. అని వ్రాసి పోస్టర్‌కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..