Actress Janhvi Kapoor Latest Photos Goes Viral
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్నీ అందిపుచ్చుకుంది. కథానాయికగా నటించిన మొదటి సినిమాకే (ధడక్) జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘అంగ్రేజీ మీడియం’, ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది. జాన్వీ నటిస్తున్న ‘దోస్తానా’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. మరో మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్ కంప్లీట్ అయింది.
రీసెంట్‌గా జాన్వీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆహ్లాదకరమైన సముద్రపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. అందాలారబోస్తూ కుర్రకారుని కవ్విస్తున్న అమ్మడి ఫొటోలకు భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.