Pragathi
Pragathi Bullet Riding: తెలుగు సినిమాల్లో అమ్మ, వదిన క్యారెక్టర్లలో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఆమె ఫిట్‌నెస్, డ్యాన్స్ వీడియోలు ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో చూశాం.
ఇప్పటి యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్ ప్రగతి సొంతం. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంటారామె. ఇక డ్యాన్స్ మూమెంట్స్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. సూపర్బ్ ఎనర్జీతో, గ్రేస్‌తో స్టెప్స్ వేస్తుంటారు.
ఇప్పుడు ఏకంగా బుల్లెట్ నడిపి అందరికీ షాక్ ఇచ్చారు ప్రగతి. పెద్ద మనిషి తరహా చీరకట్టులో బుల్లెట్ నడుపారు ప్రగతి. ‘బిలీవ్ ఇన్ ది రిజల్ట్.. యు విల్ ఫైండ్ ది ప్రాసెస్’.. అంటూ ప్రగతి ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చెయ్యగా విపరీతంగా వైరల్ అవుతోంది.