Actress Pranitha Subhash Got Married With Businessman Nitin Raju
Pranitha Subhash: గుండ్రంగా ఉండే తన పెద్ద పెద్ద కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచి, తక్కువ టైంలోనే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి ప్రణీత సుభాష్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది..
ఆదివారం (మే 30) న బిజినెస్ మెన్ నితిన్ రాజ్‌ను పెళ్లాడింది ప్రణీత.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వీరి వెడ్డింగ్‌కి అటెండ్ అయ్యారు. ప్రణీత పెళ్లి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత – నితిన్ రాజ్ దంపతులకు కన్నడ, తెలుగు సినీ పరిశ్రమ వారు, అభిమానులు విషెస్ చెబుతున్నారు..
తనీష్ హీరోగా నటించిన ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో..’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, ఎన్టీఆర్ ‘రభస’, మంచు మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’, మంచు విష్ణు ‘డైనమైట్, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (గెస్ట్ అప్పీరియన్స్) మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది..