Richa Langella : తల్లి కాబోతున్న ‘మిర్చి’ బ్యూటీ రీచా..

తాను గర్భవతిగా ఉన్నానంటూ బేబీబంప్ పిక్ పోస్ట్ చేసింది రిచా..

Richa Langella: రానా దగ్గుబాటి ఫస్ట్ మూవీ ‘లీడర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ్.. తర్వాత ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘నాగవల్లి’, ‘భాయ్’, ‘సారొచ్చారు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.. సినిమాలు పక్కన పెట్టి హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్లిన ఈ భామ సహ విద్యార్థి జో లాంగెల్లా (Joe Langella) తో ప్రేమలో పడింది..

కొద్దిరోజుల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు.. ప్రస్తుతం తాను గర్భవతిగా ఉన్నానంటూ బేబీబంప్ పిక్ పోస్ట్ చేసింది రిచా. జూన్‌లో తమ ఫస్ట్ చైల్డ్‌ బేబీ లాంగెల్లాకి వెల్‌కమ్ చెప్పబోతున్నామని, ఆ మధురక్షణాలను అనుభవించడానికి వెయిట్ చెయ్యలేకపోతున్నానంటూ.. భర్త జో లాంగెల్లా తనను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటో షేర్ చేసింది..